Begin typing your search above and press return to search.

కొత్తరూపు; వంద నోటు మారింది

By:  Tupaki Desk   |   30 Jun 2015 2:03 PM GMT
కొత్తరూపు; వంద నోటు మారింది
X
వంద రూపాయిల నోటు కొత్త లుక్ తెచ్చారు. న‌కిలీల‌కు విరుగుడుగా ఉండ‌టంతో పాటు.. వాటిని త‌యారు చేయ‌టం క‌ష్ట‌సాధ్యంగా మార్చేందుకు స‌రికొత్త నోట్ల‌ను విడుద‌ల చేసింది. గ‌త శుక్ర‌వారం రిజ‌ర్వ్‌బ్యాంకు విడుద‌ల చేసిన ఈ నోటులో కొద్ది మార్పులు చేశారు.

నోటుకు కుడి చేతి వైపున ఉండే మ‌హాత్మ‌గాంధీ బొమ్మ పైనా.. నాలుగు సింహాల గుర్తు ప‌క్క ఉండే ఆంగ్ల అక్ష‌రాల్ని మార్పులు చేసింది. వీటి సైజుల విష‌యంలోనూ మార్పులు తీసుకొచ్చారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఒకే సైజులో ఉండే అక్ష‌రాల.. తాజా కొత్త‌నోటులో చిన్న‌గా మొద‌లై పెద్ద‌గా మారుతాయి. మ‌రికొద్ది రోజుల్లో కొత్త వంద రూపాయి నోట్లు జ‌న జీవ‌నంలోకి అందుబాటులోకి రానున్నాయి.