Begin typing your search above and press return to search.

లోదుస్తులు కూడా తెలుపుగానే ఉండాలా?

By:  Tupaki Desk   |   3 July 2015 2:30 PM GMT
లోదుస్తులు కూడా తెలుపుగానే ఉండాలా?
X
ఏదైనా మోతాదు మించకుండా ఉంటే అందంగా ఉంటుంది. నిబంధనలు అన్నవి ఉండాలే కానీ.. అవి బంధనాలుగా మారకూడదు. ఒక ఆటలో ఆటగాడు అదుపు తప్పకుండా ఉండటానికి.. న్యాయబద్ధంగా కొన్ని నిబంధనలు పెట్టటాన్ని ఎవరూ ఏమీ అనరు. కానీ.. నిబంధనల పేరిట తలాతోక లేకుండా అతిగా వ్యవహరించటాన్ని ఎవరూ హర్షించరు.

ప్రస్తుతం వింబుల్డన్‌ టోర్నీ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వింబుల్డన్‌ టోర్నీలో ఆటగాళ్లు తెల్ల దుస్తుల్ని విధిగా ధరించాలి. దాన్ని ఎవరూ కాదనరు. ఆ పేరుతో మరీ ఇబ్బంది పెట్టేలా వ్యవహరించటంపై ఇప్పుడు రచ్చ మొదలైంది.

ఈ టోర్నీలో పాల్గన్న కెనడా క్రీడాకారిణి బౌచర్డ్‌ బ్రా రంగుది ధరించటంపై వింబుల్డన్‌ టోర్నీ నిర్వాహకులు హెచ్చరించటంపై పలువురు క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేయటంతో పాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు లోదుస్తుల విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? అని వారు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు అన్నవి అర్థవంతంగా ఉండాలే కానీ అర్థరహితంగా ఉండకూడదని సూచిస్తున్నారు.

ఈ విషయంపై మండిపోయిన స్టార్‌ అటగాడురోజర్‌ ఫెదరర్‌ తన అసంతృప్తిని మనసులో దాచుకోకుండా బయటకు కక్కేశాడు. ఈ అంశంపై తన నిరసను తెలపటానికి అన్నట్లుగా మాతెక్‌ అనే క్రీడాకారిణి అయితే.. మోకాళ్ల వరకు సాక్స్‌ వేసుకొచ్చి మరీ నిరసన తెలిపినట్లుగా వ్యవహరించింది. మొత్తానికి ఈ తెలుపు వ్యవహారం అతిగా మారి.. పలువురు ఆగ్రహానికి గురి కావటంతో పాటు.. వింబుల్డన్‌కు ఉన్న పేరు ప్రఖ్యాతుల్ని దెబ్బ తీసేలా ఉందన్న వాదన వ్యక్తమవుతోంది.