Begin typing your search above and press return to search.

ఫైర్‌బ్రాండ్ గార‌మ్మాయి పెళ్లికూతురు కానుంది

By:  Tupaki Desk   |   29 May 2015 11:39 AM GMT
ఫైర్‌బ్రాండ్ గార‌మ్మాయి పెళ్లికూతురు కానుంది
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ అన్న వెంట‌నే గుర్తుకొచ్చే వ్య‌క్తి రేవంత్ రెడ్డి. మాట‌ల‌తోనే కాదు.. ఆక‌ర్ష‌ణీయ‌మైన మోముతో.. అచ్చు కాలేజీ కుర్రాడిని త‌ల‌పించే రేవంత్‌రెడ్డికి పెళ్లీడుకొచ్చిన కుమార్తె ఉందంటే కాస్తంత ఆశ్చ‌ర్య‌మే. త‌న మాట‌ల‌తో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను ఉక్కిబిక్కిరి చేసే రేవంత్ రెడ్డి.. వ‌య‌సులో అంత పెద్ద‌వాడా? అనుకోకుండా ఉండ‌లేం.

కానీ.. ఆయ‌న కుమార్తెకు తాజాగా పెళ్లి నిశ్చ‌య‌మైంది. ఇక‌.. అల్లుడిది ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన ఒక సంప‌న్న‌మైన కుటుంబానికి చెందిన కుర్రాడిగా చెబుతున్నారు. ఇక‌.. రేవంత్ రెడ్డి కుమార్తె పేరు నైవిష‌. వీరి పెళ్లి త్వ‌ర‌లోనే జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. పెళ్లిని ఘ‌నంగా జ‌రిపేందుకు భారీగా ఏర్పాట్లు సాగిపోతున్నాయంట‌. మొత్తానికి టీనేజ్ కుర్రాడిలా మెరిసిపోయే రేవంత్ రెడ్డి.. వియ్యంకుడి హోదాలో త్వ‌ర‌లో ద‌ర్శ‌న‌మిస్తార‌న్న మాట‌.