Begin typing your search above and press return to search.

ఆయన దూకుడు ఏమాత్రం తగ్గదు

By:  Tupaki Desk   |   30 Jun 2015 11:04 AM GMT
ఆయన దూకుడు ఏమాత్రం తగ్గదు
X
సుమారు నెల రోజులు విచారణ ఖైదీగా జైలులో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిలుపై రావడం పట్ల ఆయన భార్య గీత ఎంతో సంతోషిస్తున్నారు. రేవంత్ ఇంతకుముందెప్పుడూ కుటుంబానికి దూరంగా ఇన్ని రోజులు లేరని ఆమె తెలిపారు. రాజకీయంగా సమస్యలు వస్తాయని చాలాసార్లు ఊహించినా ఇలా ఇలా వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని సమస్యలు సృష్టిస్తారని మాత్రం ఏనాడూ అనుకోలేదని ఆమె చెప్పారు. అయితే... ఈ పరిణామాల వల్ల రేవంత్ ఏమాత్రం భయపడరని.... ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన దూకుడు ఏమాత్రం తగ్గదని ఆమె చెప్పారు.

రేవంత్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమను ఆదరించిన, తమకు సహకరించిన అందరికీ కృతజ్ఝతలు తెలుపుతున్నామని ఆమె చెప్పారు. దెబ్బ తగిలినప్పుడే మనిషి రాటు దేలుతాడని.. ప్రజలకోసం రేవంత్ మరింత గట్టిగా పోరాడుతారని చెప్పారు. రాజకీయాల్లో అటుపోట్లు సహజమని, వాటిని తట్టుకుని నిలబడాలని ఆమె అన్నారు. ప్రతిపక్ష నేతగా పోరాటం చేస్తారనే పేరు రేవంత్ రెడ్డికి ఉందని, ఆ పేరును రేవంత్ రెడ్డి నిలబెట్టుకుంటారని గీత అన్నారు.