Begin typing your search above and press return to search.

రెజీనా రైలింజన్‌ కూతకొచ్చింది

By:  Tupaki Desk   |   2 July 2015 6:58 AM GMT
రెజీనా రైలింజన్‌ కూతకొచ్చింది
X
రేసులో వెనకబడిందే.. అని అభిమానులంతా పరేషాన్‌ అవుతున్న వేళ రెజీన షాకిచ్చే న్యూస్‌ చెబుతోంది. ఒక్కో అడుగు ముందుకేస్తూ వెనకబాటుతనానికి గుడ్‌ భాయ్‌ చెప్పేస్తోంది. రకూల్‌, రాశీల కంటే నేనేమీ తక్కువ కాదని నిరూపిస్తోంది. రెజీన ఇప్పుడు పూర్తిగా యూటర్న్‌ తీసుకుని కుర్రహీరోలకు వల వేస్తోంది. చిక్కిన ఏ చేపనీ వదిలి పెట్టడం లేదు. ఆ ప్రయత్నంలోనే ఇప్పటికే ముగ్గురు హీరోలకు వల వేసింది. మంచు హీరోలు విష్ణు, మనోజ్‌లను లైన్‌లో పెట్టింది. ఇద్దరితో సినిమాలకు సంతకాలు చేసింది. ఇంతలోనే ఎగ్రెస్సివ్‌ హీరో గోపిచంద్‌తో మరో చిత్రానికి సంతకం చేసి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది.

రెజీన ప్రస్తుతం ఒకే ఒక్క సినిమాలో నటిస్తోంది. సాయిధరమ్‌ తేజ్‌ సరసన 'పిల్లా నువ్వు లేని జీవితం' చిత్రంలో నటించి హిట్‌ కొట్టిన ఈ అమ్మడు ఆ వెంటనే మరో సినిమాకి సంతకం చేసింది. 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' ఆన్‌సెట్స్‌ ఉంది. హరీష్‌ శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకాలం సైలెంటుగా ఉండి ఒక్కసారిగా మూడు సినిమాలతో రేసులోకొచ్చింది. గోపిచంద్‌తో సినిమా ఈనెల 15న ప్రారంభం కానుంది. ఆ వెంటనే మంచు సినిమాలు సెట్స్‌కెళతాయి.

ఇలా రెజీన ఒకేసారి మూడు సినిమాలతో బిజీ అయిపోతోంది. రెజీన రైలింజన్‌ కూతకొచ్చిందన్నమాట!