Begin typing your search above and press return to search.

మెగా హీరోయిన్‌తో మంచువారబ్బాయ్‌

By:  Tupaki Desk   |   23 May 2015 9:30 AM GMT
మెగా హీరోయిన్‌తో మంచువారబ్బాయ్‌
X
వరుసగా మెగా హీరోలతో సినిమాలు చేస్తూ మెగా నాయికగా పేరు తెచ్చుకుంది రెజీన. ఈ అమ్మడు సాయిధరమ్‌తేజ్‌, అల్లు శిరీష్‌ల సరసన నాయికగా నటించింది. ఇప్పుడు మంచువారబ్బాయ్‌ సరసన నటించడానికి రెడీ అవుతోంది. మంచు విష్ణు ప్రస్తుతం దేవాకట్టా దర్శకత్వంలో డైనమైట్‌ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. ఇది రిలీజ్‌ అవ్వగానే హనుమాన్‌ చౌదరి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటించనున్నాడు.

ఇకపోతే ఈ కొత్త చిత్రంలో చెన్నయ్‌ చంద్రం రెజీనను కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. రెజీన ప్రస్తుతం సాయిధరమ్‌ సరసన నటిస్తోంది. అమెరికాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. ఈ సినిమా పూర్తవ్వగానే విష్ణుతో సినిమా కోసం రెడీ అవుతుంది. జూలైలోనే ఈ సినిమా ఆన్‌సెట్స్‌కి వెళ్లనుంది. టాలీవుడ్‌లో ఉన్న నవతరం నాయికల్లో కెరీర్‌ని జెట్‌ స్పీడ్‌తో మలుచుకుంటున్న కథానాయికగా రెజీనకి గుర్తింపు వచ్చింది. ఈ భామ ఇంతకాలం యువహీరోలతోనే నటిస్తోంది. స్టార్‌ హీరోలు బన్ని, చరణ్‌, ఎన్టీఆర్‌లతో నటించాలన్నది రెజీన కోరిక. కానీ అది ఇప్పట్లో నెరవేరేట్టే లేదు.