Begin typing your search above and press return to search.

పాపనాశనం చూడటానికి '4' రీజన్స్‌

By:  Tupaki Desk   |   3 July 2015 2:05 PM GMT
పాపనాశనం చూడటానికి 4 రీజన్స్‌
X
మలయాళ దృశ్యం ఉత్తరాది, దక్షిణాది అనే తేడాలేకుండా అన్నిచోట్లా చుట్టేస్తోంది. రీమేకుల రూపంలో మళ్లీ మళ్లీ తెరకెక్కి హిట్టు మీద హిట్టు కొట్టేస్తోంది. ఇప్పటికే మలయాళం, తెలుగులో ఘనవిజయం సాధించింది. తమిళ్‌, హిందీలోనూ రీమేకైంది. తమిళ్‌లో కమల్‌హాసన్‌ -గౌతమి జంటగా రీమేకై ఇటీవలే రిలీజైంది. కోలీవుడ్‌ బాక్సాఫీస్‌ని ఓ ఊపు ఊపేస్తోంది ఈ సినిమా. ఈ సందర్భంగా ఐదు కారణాలు పాపనాశం విజయానికి కారణం అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి ఓ నాలుగు రీజన్స్‌ను చూస్తే.. ఇలా ఉన్నాయి...

రీజన్‌ 1... బ్యుటిఫుల్‌ లేడీ రీ-ఎంట్రీ... దాదాపు 15ఏళ్ల తర్వాత గౌతమి ఈ చిత్రంతో తిరిగి ముఖానికి రంగేసుకుంది. 1998లో ఇనియవాలే అనే చిత్రంలో చివరిసారిగా నటించింది గౌతమి. ఆ తర్వాత సినిమాల్ని పూర్తిగా వదిలేసి టెలివిజన్‌, కాస్ట్యూమ్స్‌ విభాగంలోకి అడుగుపెట్టింది. ఇన్నాళ్టికి తిరిగి నటిస్తోంది కాబట్టి ప్రేక్షకాభిమానుల్లో ఎగ్జయిట్‌మెంట్‌ పెరిగింది.

రీజన్‌ 2... 20 ఏళ్ళ తరువాత... కమల్‌హాసన్‌-గౌతమి తమిళ్‌లో సక్సెస్‌ఫుల్‌ పెయిర్‌. అపూర్వ సగోదారంగళ్‌ అనే చిత్రంలో జతగా నటించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ్‌లో ఈ జంట నటించిన సినిమాలు కనువిందు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి సహజీవనం నేపథ్యంలో.. మరోసారి ఈ జోడీ తెరపై కనిపించడం పాపనాశం క్రేజును రెట్టింపు చేసింది. వీళ్లిద్దరూ ఇలా కలసి నటించడం 20 ఏళ్ళ తరువాత ఇదే.

రీజన్‌ 3... తప్పులు లేవు... మలయాళంలో దృశ్యం కొన్ని తప్పులతడకలతో తెరకెక్కింది. వాటన్నిటినీ సరిచేసి ఇప్పుడు మరోసారి జీతూ జోసెఫ్‌ తమిళ్‌లో తెరకెక్కించారు. 100శాతం లోపాల్లేని స్క్రిప్టు అనేది ఎక్కడా ఉండదు. హాలీవుడ్‌ వాళ్లకే సాధ్యం కాదు. కానీ పాపనాశంకి కుదిరిందని జీతూ ఇప్పటికే ఇంటర్వ్యూల్లో చెప్పాడు. సో అది ఒక పెద్ద ప్లస్‌

రీజన్‌ 4... పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌... కేబుల్‌ ఆపరేటర్‌ అనే మధ్యతరగతి యువకుడిగా కమల్‌హాసన్‌ పాత్రలో కొంత స్థానిక యాస, భాషను యాడ్‌ చేశారు. ఇది బాగా క్లిక్కయ్యింది. ఎమోషన్‌ పీక్స్‌కి తీసుకెళ్లడంలో ఇది ప్లస్‌ అయ్యింది. ఒక సామాన్యుడు హత్య చేసి అందరినీ ఫూల్స్‌ చేయడం అనే పాయింట్‌ బాగా కనెక్టయ్యింది. హీరో సహా కుటుంబమంతా అబద్ధాలు చెప్పి తప్పించుకో చూడడం నిజజీవితాల్ని తెరపై ప్రతిబింబించింది. ప్రతి ఒక్కరి అనుభవాలు పాత్రల్లో ప్రతిబింబించాయి. ఈ కారణాలన్నీ పాపనాశం విజయానికి కలిసొచ్చాయి. గెటప్‌లో కనిపించా. అలాగే సిద్ధార్థ్‌- హన్సిక జంటగా ఉయిరే ఉయిరే చిత్రాన్ని నిర్మిసప్తున్నా.

...అంటూ ముగించారు జయప్రద!!!