Begin typing your search above and press return to search.

త్రిష మ్యాటెర్‌లో వేలెట్టింది ఎవరు?

By:  Tupaki Desk   |   4 July 2015 9:30 AM GMT
త్రిష మ్యాటెర్‌లో వేలెట్టింది ఎవరు?
X
బోయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ చేసుకున్నంత ఈజీగా కాబోయేవాడితో బ్రేకప్‌ చేసుకుంది త్రిష. బిజినెస్‌మేన్‌ వరుణ్‌మణియన్‌తో పెద్దలు కుదిర్చిన వివాహానికి సిద్ధమైన ఈ అమ్మడు నిశ్చితార్థం తర్వాత నిర్ధాక్షిణ్యంగా కటీఫ్‌ చెప్పేయడం పెద్ద రేంజులో చర్చకొచ్చింది. పరిశ్రమలో దీనిపై రకరకాల ఊహాగానాలు సాగాయి. ఈ పెళ్లి చెడిపోవడంలో చాలామంది ప్రమేయం ఉందని త్రిష స్వయంగా కామెంట్‌ చేసింది.

అంటే త్రిష పెళ్లి వద్దనుకున్న తర్వాత దానిని మమ్మీ కూడా ఓకే చేసిందని అంతటా గుసగుసలు నడిచాయి. అంతేనా ఇలా అర్థాంతరంగా పెళ్లి ఆగిపోవడాన్ని ఆపడంలో వరుణ్‌ పూర్తిగా విఫలమయ్యాడన్న విమర్శలు వచ్చాయి. ఏదేమైనా 30ప్లస్‌లో అడుగుపెట్టిన త్రిష పెళ్లి ఆపాల్సిన అవసరం ఎవరికి కలిగింది? త్రిషకు అంతటి బద్ధ శత్రువులు ఎవరున్నారు? త్రిష చెప్పినట్టు 'చాలా మంది'లో ఎవరెవరు ఉన్నారు? ఇలాంటి ప్రశ్నలెన్నో సమాధానం లేని శేష ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.

అయితే వరుణ్‌ మణియన్‌కి పెద్దగా గిట్టని హీరో ధనుష్‌ నిశ్చితార్థ వేడుకల్లో కనిపించడం చర్చకొచ్చిందని, ధనుష్‌తో త్రిష స్నేహం వరుణ్‌ మణియన్‌కి నచ్చలేదన్న గాసిప్స్‌ కూడా వినిపించాయ్‌. ఒకవేళ ధనుష్‌ వల్ల, అతడితో పాటే ఉన్న గ్యాంగ్‌ వల్ల పెళ్లి చెడిపోయిందా అన్న చర్చలు సాగుతున్నాయి. వరుణ్‌తో నెలరోజుల్లోనే కలిసిపోయిన త్రిష ఇంతలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుందేమిటని ప్రశ్నించిన ఓ యువహీరో కూడా ఈ వివాదంలో చర్చకొచ్చాడు.