Begin typing your search above and press return to search.

రానా, ప్రభాస్‌ గుర్రాలాట.. యమ డేంజర్‌

By:  Tupaki Desk   |   6 July 2015 10:00 AM GMT
రానా, ప్రభాస్‌ గుర్రాలాట.. యమ డేంజర్‌
X
మామూలు సినిమాల్లో యాక్షన్‌ సన్నివేశాలకే గాయపడి పోతుంటారు మన హీరోలు. మరి బాహుబలి లాంటి వార్‌ మూవీలో అంటే ఎలాంటి యాక్షన్‌ సన్నివేశాలుంటాయో.. అవి చేసేటపుడు ఎంత ప్రమాదమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో విలన్‌ పాత్ర చేసిన రానాకు.. షూటింగ్‌లో గాయపడ్డం కొత్తేం కాదు. కృష్టం వందే జగద్గురుం, డిపార్ట్‌మెంట్‌ సినిమాలకు పెద్ద దెబ్బలే తగిలించుకున్నాడు. ఇక బాహుబలిలో అయితే తనకు తగిలిన దెబ్బలకు లెక్కే లేదంటున్నాడు రానా. ముఖ్యంగా గుర్రపు స్వారీ చాలా ప్రమాదకరంగా సాగిందని.. ఓసారి చాలా ఎత్తునుంచి కింద పడి బాగా గాయపడ్డానని చెప్పాడు రానా.

''నేను చేసిన ప్రతి సినిమాకీ చిన్నదో పెద్దదో దెబ్బ తగలడం కామన్‌. బాహుబలి సినిమా చేసేటపుడు అయిన గాయాలు లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. ఓ ఫైట్‌ సీన్‌ ముందు రిహార్సల్స్‌ చేస్తుంటే మోకాలికి గాయమైంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా దెబ్బ తగిలింది. ప్రభాస్‌ వచ్చి.. 'బావా నిన్నుఉ దరిద్రం ఛేజ్‌ చేసుకుంటూ వస్తోంది. ఏం చేయలేం'' అన్నాడు. రాజస్థాన్‌ నుంచి షూటింగ్‌ కోసం రెండు గుర్రాల్ని తీసుకొచ్చారు. ఆ గుర్రాల్ని చూస్తేనే భయమేసింది. నేను, ప్రభాస్‌ కలిసి గుర్రపు స్వారీ చేయాలి. అప్పటికే గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నా.. ఆ గుర్రాల్ని అదుపు చేయడం కష్టమైంది. చాలా వేగంగా పరుగెత్తాయి ఆ గుర్రాలు. నా వల్ల గుర్రాన్ని అదుపు చేయడం కాలేదు. ప్రభాస్‌ కూడా వెనుక స్వారీ చేస్తూ.. ''అరేయ్‌ బావా.. గుర్రం తన్నేస్తోంది'' అన్నాడు. నా గుర్రం పరిస్థితీ అంతే. పరుగెట్టి పరుగెట్టి గుర్రం సడెన్‌గా బ్రేక్‌ వేసినట్లు ఓచోట ఆగిపోయింది. నేను పైనుంచి ఎగిరి పడ్డా. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. చాలా ఎత్తు నుంచి పడ్డాను. తలకు గాయం కావాల్సింది. అదృష్టవంతుణ్నని డాక్టర్‌ అన్నాడు. నేను తిన్న తిండి.. పెంచిన బాడీ నన్ను కాపాడాయి'' అని చెప్పాడు రానా.