Begin typing your search above and press return to search.

ది నేమ్‌ ఈజ్‌ రానా దగ్గుబాటి!!

By:  Tupaki Desk   |   3 July 2015 4:29 AM GMT
ది నేమ్‌ ఈజ్‌ రానా దగ్గుబాటి!!
X
లీడర్‌ సినిమాలో రానాని, బాహుబలిలో రానాని పోల్చి చూస్తే.. అతడే ఇతడా? అన్న సందేహం కలగకుండా ఉండదు. బక్క పలచగా కడ్డీలా కనిపించాడు లీడర్‌లో. ఆ తర్వాత కాలక్రమంలో నెమ్మదిగా పర్సనాలిటీలో మార్పులొచ్చాయి. కానీ హీరోయిక్‌ లుక్‌ విషయంలో కొంత సందేహం ఉండేది. చివరికి ఎస్‌.ఎస్‌.రాజమౌళి కళ్లలో పడ్డాడు. అంతే అతడిలో అనూహ్య మార్పులొచ్చాయి.

బాహుబలిలో భళ్లాలదేవ క్యారెక్టర్‌ కోసం మహాకాయుడిలా మారిపోయాడు రానా. ఠఫ్‌ టాస్క్‌ మాస్టర్‌ మనోడ్ని ఒక శిల్పంలా చెక్కాడు. రానా ఇప్పుడు తిరుగులేని వీరుడిలా కనిపిస్తున్నాడు. బాహుబలి రిలీజై హిట్‌ కొట్టడం ఖాయం. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గురించి ఇప్పటికే చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇందులో వీరాధివీరుడిగా రానా పరాక్రమం చూపించబోతున్నాడు. ఈ చిత్రంతో అతడి స్టాండార్డ్‌ హాలీవుడ్‌ రేంజుకి పెరుగుతుందా అనే హైప్‌ కూడా ఉందిప్పుడు. మనోడు మున్ముందు బాలీవుడ్‌, హాలీవుడ్‌లో ప్రముఖ నటిడిగా వెలిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

వార్‌ ఎపిక్‌ సినిమాలు, భారీ యాక్షన్‌ సినిమాలకు సరిపడే పర్సనాలిటీ రానాకి ఉందిప్పుడు. కాబట్టి ఆ దిశగా రానా కోసం కథలు అల్లుకునే దర్శకరచయితలు ఉండనే ఉంటారు. అందుకే బాహుబలి రానాని సినీప్రపంచంలో సరికొత్తగా ఆవిష్కరిస్తుందనడంలో సందేహమే లేదు. మనవడు సాధించిన ఈ ఘనతను చూడడానికి తాత లేకపోయాడు. నాయుడుగారు పైనుంచి ధీవించే ఉంటారు. అందుకే రానాలో ఈ కొత్త ఫైర్‌ అన్నమాట. ది నేమ్‌ ఈజ్‌ రానా దగ్గుబాటి. గెట్‌ రెడీ.