Begin typing your search above and press return to search.

బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌లో రామ్‌

By:  Tupaki Desk   |   5 July 2015 9:03 AM GMT
బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌లో రామ్‌
X
కెరీర్లో ఇప్పటిదాకా ఒక్క రీమేక్‌లోనూ నటించలేదు యువ కథానాయకుడు రామ్‌. గత ఏడాది తమిళంలో సూపర్‌ హిట్టయిన ధనుష్‌ సినిమా 'వేల ఇల్ల పట్టాదారి'ని రీమేక్‌ చేయడానికి ఓ దశలో ప్రయత్నాలు జరిగాయి. రామ్‌ పెదనాన్న స్రవంతి రవికిషోర్‌ రీమేక్‌ రైట్స్‌ కూడా తీసుకున్నాడు. కానీ ఆ క్యారెక్టర్‌కు ధనుషే కరెక్ట్‌ అని.. రామ్‌ చేస్తే సూటవ్వదని భావించి రీమేక్‌ ప్రయత్నాలు మానుకుని.. డబ్బింగ్‌ చేసి రిలీజ్‌ చేశారు. సినిమా చూశాక రవికిషోర్‌ నిర్ణయం కరెక్టే అని జనాలు ఫీలయ్యారు.

ఐతే 'వీఐపీ' మిస్సయినా.. రామ్‌ కన్ను ఇప్పుడు ఇంకో రీమేక్‌పై పడింది. ఐతే ఈసారి అతను మలయాళం సినిమాపై ఫోకస్‌ పెట్టాడు. ప్రస్తుతం కేరళలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న బ్లాక్‌బస్టర్‌ మూవీ 'ప్రేమమ్‌'ను రామ్‌ హీరోగా రీమేక్‌ చేయబోతున్నారట. నివిన్‌ పౌలీ హీరోగా నటించిన ఈ సినిమాకు అల్ఫోన్స్‌ పుతెరిన్‌ దర్శకత్వం వహించాడు. 'నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌' తరహాలో ఓ వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో లవ్‌ ఎపిసోడ్స్‌ను చూపించిన సినిమా ఇది. ఆటోగ్రాఫ్‌ ఛాయలున్నప్పటికీ దీని ప్రత్యేకత దీనిదే.

20 రోజులకు పైగా హౌస్‌ఫుల్స్‌తో నడుస్తున్న 'ప్రేమమ్‌' మలయాళ సినిమాకు సంబంధించిన రికార్డులన్నీ తుడిచిపెట్టేస్తోంది. ఇప్పటికే ఆ సినిమా 30 కోట్లకు పైగా వసూలు చేసి.. తొలి మూడు వారాల కలెక్షన్లకు సంబంధించి 'దృశ్యం' సినిమా నెలకొల్పిన రికార్డుల్ని బద్దలు కొట్టింది. ఓవరాల్‌ కలెక్షన్లలో దృశ్యం రికార్డును కూడా అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఐతే ఈ సినిమా రామ్‌కు బాగా సూటవుతుందన్న ఉద్దేశంతో రవికిషోర్‌.. రీమేక్‌ రైట్స్‌ తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రామ్‌ ఒకేసారి హరికథ, శివమ్‌ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ ఏడాది ఆఖరుకు ఆ రెండూ పూర్తవుతాయి. ఆ తర్వాత 'ప్రేమమ్‌' రీమేక్‌ మొదలయ్యే అవకాశముంది. ఈ సినిమాకు డైరెక్టర్‌ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు.