Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆరున్నరడుగుల బుల్లెట్టు

By:  Tupaki Desk   |   1 July 2015 11:41 AM GMT
ఫోటో స్టోరి: ఆరున్నరడుగుల బుల్లెట్టు
X
రకూల్‌ స్పీడుమీదుంది. ఒకేసారి ముగ్గురు స్టార్‌ హీరోల సినిమాలకు సంతకాలు చేసి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. చరణ్‌, ఎన్టీఆర్‌, బన్ని ఈ ముగ్గురికీ ఓకే చెప్పి టాప్‌-1 పొజిషన్‌కి వచ్చేసింది. అయితే సూపర్‌స్టార్‌ మహేష్‌కి నో చెప్పి చర్చల్లోకొచ్చింది. కాల్షీట్ల సర్ధుబాటు సమస్య వచ్చిందే కానీ ప్రిన్స్‌ని కూడా వదులుకునే దానిని కాదని నిజాయితీగా చెప్పింది. అయితే ఇలా స్టార్‌ హీరోల వికెట్టన్నీ రకూల్‌కే ఎందుకు పడిపోతున్నాయ్‌? అనే ప్రశ్నకు సమాధానమే ఈ ఫోటో.

రకూల్‌ ప్రస్తుతం ఆన్‌సెట్స్‌ బిజీగా ఉన్నప్పటి ఫోటోషూట్‌ ఇది. శ్రీనువైట్ల దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తోంది. చరణ్‌తో ఆటా పాటలో బిజీ బిజీగా ఉంది. అలా బిజీగా ఉన్నప్పుడే ఇదిగో ఇలా కెమెరా కంటికి చిక్కింది. పసిడి ఛాయ మేనిపై నల్ల రంగు చీర వెరీ స్పెషల్‌. నలుపుపై ఎర్ర రంగు డిజైనర్‌ అంచు .. వెరీ వెరీ స్పెషల్‌. ఆ డిజైనర్‌ అంచును ఒళ్లంతా ఆనకొండలా చుట్టేసి బొడ్డులో దోపేసిన తీరు చూస్తుంటే కుర్రకారు మతి చెడకుండా ఉంటారా? ఇవిగో ఇలాంటి టెక్నిక్స్‌తోనే స్టార్‌ హీరోల్ని బుట్టలో వేసేసింది. ఆరడుగుల బుల్లెట్టు కాదు, ఆరున్నర అడుగుల బుల్లెట్టుని అంటూ పవన్‌కే సవాల్‌ విసురుతున్నట్టు ఉంది కదూ ఈ ఫోజు?