Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్‌ కోసం ఒక ఇంటర్యూ వస్తోంది

By:  Tupaki Desk   |   3 July 2015 5:30 PM GMT
ఫ్యాన్స్‌ కోసం ఒక ఇంటర్యూ వస్తోంది
X
అందరూ ఒక కుటుంబంలో పనిచేస్తున్నారు. కాని రావడానికి మాత్రం కుదరట్లేదేమో మరి. నిజానికి ఇప్పటివరకు తెలుగు మీడియా కోసం ఒక్కటంటే ఒక్క ఇంటర్యూ కూడా ఇవ్వలేదు బాహబలి టీమ్‌. ఇప్పటివరకు కేవలం వేరే ఛానళ్లకు, యుట్యూబ్‌ షో లకు, వెబ్‌సైట్లకు రాజమౌళి ఇంటర్యూలను ఆధారం చేసుకొని తెలుగులో కథలు రాసుకోవడమే కాని, మన మీడియాతో మనోడు డైరెక్టుగా మాట్లాడలేదు. ఇక యాక్టర్లు కూడా తక్కువ కాదు. ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడటమే కాని, నో మీడియా ఇంటరాక్షన్‌.

ఇక ఆ కోరికను, లోటును తీర్చడానికి బాహుబలి టీమ్‌తో మీడియాతో గంటలు గంటలు మాట్లేడోస్తోంది ఇప్పుడు. అయితే బొంబాయిలో రకరకాల మీడియా హౌస్‌లు చుట్టూ తిరిగిన టీమ్‌, పాపం అక్కడ బాగా అలసిపోయిందట.. అందుకే ఇక్కడ మాత్రం ఒకే ఒక్క ఇంటర్యూ ఇచ్చేసి అందరికీ షేర్‌ చేస్తున్నారు. ఈ ఇంటర్యూలో ప్రభాస్‌, రానా, తమన్నాలు పాల్గొనగా.. వీరిని కేరింతలు పెట్టించి కవ్వించేసే యాంకర్‌ అనసూయ ప్రశ్నలు అడిగేస్తోంది. అదేటండీ.. సినిమాలో ఎలాగో అనుష్కను చూపించరు, ఇక్కడ కూడా ఆమెను దాచేస్తారా? అబ్బే అదే చెప్పేది. ఆల్రెడీ అనుష్క రాఘవేంద్రరావుగారి కొడుకు తీస్తున్న ''సైజ్‌ జీరో'' కోసం బాగా వెయిట్‌ పెరిగి షూటింగ్‌లో బిజీగా ఉంది. సో, రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందిన 'బాహుబలి 1' సినిమాను ప్రమోట్‌ చేయడం కాస్త కష్టమే. ఇంతకీ ఈ ఇంటర్యూ చూసే మహర్భాగ్యం ఎప్పుడు స్వామి? త్వరలోనే నాయనలారా!!