Begin typing your search above and press return to search.

మన వెంటే వ్యతిరేకులు ఉంటారు -రాజమౌళి

By:  Tupaki Desk   |   30 Jun 2015 5:30 PM GMT
మన వెంటే వ్యతిరేకులు ఉంటారు -రాజమౌళి
X
ఏదైనా సినిమా వస్తోంది అంటే దానికి విమర్శలు, ప్రశంసలు రెండూ ఉంటాయి. ముఖ్యంగా పెద్ద బడ్జెట్‌ సినిమాలకు విమర్శకుల టెన్షన్‌ చాలా ఎక్కువ. ఫలితం ఏమాత్రం తేడా వచ్చినా కోట్లలో లావాదేవీల్లో తేడాలొచ్చేస్తాయి. విమర్శకుల రాతలు కొన్నిసార్లు ఫలితాన్ని కొంతవరకూ ప్రభావితం చేస్తుంటాయి.

ఇదే విషయంపై కరణ్‌ జోహార్‌ అడిగిన ఓ ప్రశ్నకు రాజమౌళి సూటిగా స్పందించారు. బాలీవుడ్‌లో బాహుబలి ప్రమోషన్‌లో భాగంగా విమర్శకుల గురించి కరణ్‌ ప్రశ్నించినప్పుడు.. రాజమౌళి ఏమన్నారంటే.. మన చుట్టూ నెగెటివ్‌ ప్రచారం చేయడానికి, వేలు పెట్టి కెలకడానికి కొందరు ఉంటారు. రివ్యూల పేరుతో ఇదంతా చేస్తూనే ఉంటారు. నా సినిమాలన్నిటికీ ఇలాంటి నెగెటివ్‌ విమర్శలొచ్చాయి. కానీ ఒకే ఒక్క సినిమాకి మాత్రం అందరూ పాజిటివ్‌గానే స్పందించారు. మర్యాద రామన్న చిత్రానికి విమర్శలు రాలేదు. అయితే నా సినిమాల విషయంలో రివ్యూలు ఎలా ఉన్నా.. ప్రేక్షకదేవుళ్లు మాత్రం పాజిటివ్‌ ఫలితాన్నే ఇచ్చారు.. అని అన్నారు రాజమౌళి.

ఏదో ఒక లోపాన్ని వెతికి సినిమాని కిల్‌ చేయాలని చూసేవాళ్లుంటారు. అయితే ఔట్‌పుట్‌ సరిగా లేనప్పుడే అదంతా అని రాజమౌళి ఈ సందర్భంగా విమర్శకుల పాయింట్‌ ఆఫ్‌ వ్యూ మాట్లాడారు. ఏదేమైనా జూలై 10న బాహుబలి వస్తోందంటే.. అందరికీ ఫుల్‌ టెన్షనే. ఏమవుతుందోనని.