Begin typing your search above and press return to search.

జక్కన్న ఈసారి రూటు మార్చేశాడే..

By:  Tupaki Desk   |   6 July 2015 3:30 PM GMT
జక్కన్న ఈసారి రూటు మార్చేశాడే..
X
ఒకట్రెండు సక్సెస్‌లు వస్తే కాళ్లు నేల మీద నిలవట్లేదు జనాలకు. కానీ ఒకటి రెండు కాదు.. వరుసగా తొమ్మిది హిట్లు కొట్టిన ఘనుడు రాజమౌళి. అందులో ఆరు సినిమాలు బ్లాక్‌బస్టర్లే. సినిమా సినిమాకు కొన్ని మెట్లు పైకి ఎక్కుతూనే ఉన్నాడు రాజమౌళి. ఒక హిట్టు తర్వాత పెరిగే అంచనాల్ని అందుకోవడానికి జక్కన్న ఎంత కష్టపడుతున్నాడో అందరం చూస్తూనే ఉన్నాం. ఐతే అంచనాలు పీక్స్‌కు చేరినపుడు రాజమౌళి కొంచెం తెలివైన ఎత్తుగడ వేస్తుంటాడు. గతంలో ఎన్టీఆర్‌తో సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చాక రాజమౌళి మీద అంచనాలు బాగా పెరిగిపోయాయి. దీంతో తన మీద ప్రెజర్‌ తగ్గించుకోవడానికి నితిన్‌ లాంటి అప్‌కమింగ్‌ హీరోతో 'సై' సినిమా చేశాడు.

మళ్లీ 'మగధీర' రూపంలో మరో ఇండస్ట్రీ ఇచ్చినపుడు కూడా ఇలాగే చేశాడు. వెంటనే సునీల్‌ లాంటి కమెడియన్‌ టర్న్‌డ్‌ హీరోతో 'మర్యాదరామన్న' లాంటి చిన్న సినిమా చేశాడు. ఈ రెండు సందర్భాల్లోనూ తన మీద ప్రెజర్‌ పడకుండా జక్కన్న భలే మేనేజ్‌ చేశాడనుకున్నారు జనాలు. ఇప్పుడు 'బాహుబలి' రూపంలో మరో ఇండస్ట్రీ హిట్టివ్వడం ముందే ఖాయమైపోయింది. ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలున్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దీని తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడు, ఎవరితో చేస్తాడు అని ఆసక్తి నెలకొంది. ఐతే ఇంతకుముందు లాగే ఏదైనా చిన్న హీరోతో సినిమా ఉంటుందిలే అనుకుంటుంటే.. మహేష్‌ లాంటి సూపర్‌ స్టార్‌తో సినిమా కన్ఫమ్‌ చేసి అందరికీ షాకిచ్చాడు జక్కన్న. బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి.. మహేష్‌తో జట్టు కడితే అంచనాలు ఆకాశాన్నంటడం ఖాయం. మరి ఆ అంచనాల్ని ఎలా అందుకుంటాడో మరి.