Begin typing your search above and press return to search.

రాజమౌళితో మహేష్‌.. ఎప్పుడో ఫిక్స్‌

By:  Tupaki Desk   |   5 July 2015 8:51 AM GMT
రాజమౌళితో మహేష్‌.. ఎప్పుడో ఫిక్స్‌
X
ఎస్‌.ఎస్‌.రాజమౌళి రెండున్నరేళ్లు అహోరాత్రులు శ్రమించి బాహుబలి అనే శిల్పాన్ని చెక్కాడు. ఈ సినిమా ఇంటా బైటా హోరెత్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి అభిమానులు రిలీజ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూలై 10న రిలీజైపోతుంది సరే.. ఆ తర్వాత రాజమౌళి ఇంకేం చేస్తారు ఏ హీరోతో సినిమా తీస్తారు అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఎప్పట్నుంచో మహేష్‌ హీరోగా కె.ఎల్‌.నారాయణ నిర్మాతగా రాజమౌళి ఓ సినిమాని తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకున్నారట. ఇద్దరూ సైన్‌ కూడా చేసేశారట. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలిద్దరూ కన్ఫమ్‌ చేశారు కూడా. అయితే ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్ల వల్ల రాజమౌళి వేరొక హీరోతో పెట్టుకోవడం లేదు. ఇక బాహుబలి తొలి భాగం పూర్తయింది. రెండో భాగం సెప్టెంబర్‌లో సెట్స్‌కెళ్లబోతోంది. ఆ తర్వాత మహేష్‌తోనే సినిమా ఉంటే బాగుండి అని ఫ్యాన్స్‌ కూడా అనకుంటున్నారు.

మహేష్‌ ఎప్పట్నుంచో రాజమౌళి దర్శకత్వంలో నటించాలనుకుంటున్నాడు. కాబట్టి ఇదే బెస్ట్‌ మూమెంట్‌.. బాహుబలి 2 చిత్రీకరణ పూర్తయ్యేప్పటికి మహేష్‌ బ్రహ్మూెత్సవం కూడా పూర్తవుతుంది.. అప్పుడు కలిసి పనిచేసే వీలుంటుంది.. చూద్దాం మరి ఈ కాంబినేషన్‌ వర్కవుట్‌ అవుతుందేమో.