Begin typing your search above and press return to search.

జూనియర్‌ ఎన్టీఆర్‌ని సీన్లోకి తెచ్చారు

By:  Tupaki Desk   |   25 May 2015 4:02 PM GMT
జూనియర్‌ ఎన్టీఆర్‌ని సీన్లోకి తెచ్చారు
X
ఏం మాట్లాడినా ప్రజలు నమ్మలేని విచిత్రమైన పరిస్థితుల్లో ఏపీ కాంగ్రెస్‌ పార్టీ చిక్కుకుపోయింది. రాష్ట్ర విభజన సమయంలో వారు చేసిన మోసం ఇంకా పచ్చి..పచ్చిగా ఉంటూ సీమాంధ్రుల మనసుల్ని కోత పెడుతోంది. పదేళ్లు నాన్‌స్టాప్‌గా అధికారాన్ని అనుభవించిన వారు.. విభజన సమయంలో.. ఏపీ ప్రజలు ఆవేశంగా ఉన్నా.. వారి కోపం మహా అయితే ఆర్నెల్లకు మించి ఉందని.. లేదంటే మరో ఏడాది మాత్రమే ఉంటుందన్న కాకి లెక్కలు చాలానే వేసుకున్నారు.

అయితే.. వారి అంచనాలకు భిన్నంగా ఉండటంతో ఏపీ కాంగ్రెస్‌ నేతలకు ఇప్పుడేం అర్థం కావటం లేదు. ఈ నేపథ్యంలో ఏదోలా ఏపీ సర్కారుపై విమర్శలు చేస్తూ.. సీమాంధ్రుల మనసుల్ని దోచుకోవాలని విపరీతంగా ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగా అర్థంపర్థం లేని విమర్శలు చేసి అభాసుపాలు అవుతున్నారు.

తాజాగా ఏపీ కాంగ్రెస్‌ రథసారధి రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ఏపీ సీఎం.. ఆయన కుమారుడు లోకేశ్‌బాబులపై అవినీతి ఆరోపణలు సంధించారు. సూట్‌కేస్‌.. బ్రీఫ్‌కేస్‌ సర్కారుగా అభివర్ణించిన రఘువీరా.. పెద్దబాబుకు బ్రీఫ్‌ కేస్‌ అని.. చినబాబుకు సూట్‌కేస్‌ అంటూ కాస్తంత రిథమ్‌గా మాట్లాడి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. లోకేశ్‌ను ప్రమోట్‌ చేయటానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ను వాడుకొని వదిలేశారంటూ విమర్శించారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎపిసోడ్‌కు సంబంధించి ఏం జరిగిందన్నది అందరికి తెలిసిందే. అలిగి పార్టీకి కాస్తంత దూరంగా ఉంటూ.. షూటింగ్‌ బిజీలో ఉండిపోయిన ఆయన.. సార్వత్రిక ఎన్నికల సమయంలోకనీసం ప్రచారానికి కూడా రాలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. అలాంటప్పుడు.. జూనియర్‌ను చంద్రబాబు ఏ విధంగా వాడుకున్నారన్నది రఘువీరాకే తెలియాలి.