Begin typing your search above and press return to search.

డైలాగులు ఎవరి కోసం పూరీ...

By:  Tupaki Desk   |   6 July 2015 11:30 AM GMT
డైలాగులు ఎవరి కోసం పూరీ...
X
స్పీడ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఎక్కడున్నాడు? ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? ఎవరి కోసం కథ రాస్తున్నాడు? ఇలాంటి సందేహాలెన్నో మెగాభిమానుల మెదడు తొలిచేస్తున్నాయి. పూరీ ప్రస్తుతం థాయ్‌లాండ్‌్‌లో ఉన్నాడు. చిరు సినిమా కోసం డైలాగ్స్‌ రాస్తున్నాడని చెబుతున్నారు.. అయితే పూరి చిరుకోసమే రాస్తున్నాడా? లేక వరుణ్‌తేజ్‌తో సినిమా కోసం పనిచేస్తున్నాడా? అన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది.

చిరుతో ఆటోజానీ, వరుణ్‌తో లోఫర్‌ తెరకెక్కిస్తున్నానని పూరీ కన్ఫమ్‌ చేశాడు కాబట్టి.. ప్రస్తుతం మెగాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణమిది. అన్నయ్య 150వ సినిమా ఎప్పుడెప్పుడా? అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఆ సినిమాకి సంబంధించిన ప్రోగ్రెస్‌ విషయంలో పూరీ నోరు మెదపడం లేదు. అసలే 2015 పూరీకి కలిసొచ్చిన సంవత్సరం. ఏడాది ఆరంభమే టెంపర్‌తో హిట్‌ కొట్టాడు. ఇటీవలే పరిమిత బడ్జెట్‌లో జ్యోతిలక్ష్మి తెరకెక్కించి సేఫ్‌ ప్రాజెక్ట్‌ అనిపించాడు. ఈ ఊపులోనే చిరుతో క్రేజీ ప్రాజెక్టు మొదలు పెట్టేస్తే బావుంటుందని మెగాభిమానులంతా ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే పూరీ ప్రస్తుతం చిరు కోసమా? వరుణ్‌తేజ్‌ కోసమా? ఆ డైలాగ్స్‌ రాసేది..