Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ దొరికితే ఇక షూటింగే

By:  Tupaki Desk   |   24 May 2015 5:30 PM GMT
హీరోయిన్‌ దొరికితే ఇక షూటింగే
X
మే 30 వరకు దర్శకుడు పూరి జగన్‌ ఫుల్‌ బిజీ. బ్యాంకాక్‌లో కూర్చొని మెగాస్టార్‌ చిరంజీవి 150 సినిమా కథను చెక్కాలి. అది పూర్తయ్యాక వెంటనే హైదరాబాద్‌ వచ్చేసి పూర్తి నెరేషన్‌ చిరంజీవికి ఇవ్వాలి. ఇదంతా పూర్తయినా కూడా 150వ సినిమా సెప్టెంబర్‌లో మొదలవుతోంది కాబట్టి, మూడు నెలలు ఖాళీ ఉంటుంది. అందుకే నితిన్‌ బాబు రెడీగా ఉన్నాడు.

స్పీడ్‌ డైరక్టర్‌గా పేరొందిన పూరి తో మూడు నెలల్లో ఒక ప్రాజెక్టు పూర్తి చేయించుకుంటే కెరియర్‌లో స్పీడుగా ఒక సినిమాను చేసేసినట్లే. అసలే ఓ నెల రోజుల్లో జ్యోతిలక్ష్మి సినిమాను తీసేసిన పూరి, నితిన్‌తో ఓ రెండు నెలల్లో సినిమాను చేయగలడు. అందుకే నితిన్‌ ఫుల్‌ ఊపు మీదున్నాడట. కాకపోతే మనోడికి హీరోయిన్‌ ఎవర్ని పెట్టుకోవాలి అనే డౌట్‌ ఒకటి మెదులుతోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంటనే డేట్స్‌ ఇవ్వడానికి స్టార్ల దగ్గర ఖాళీల్లేవు. సమంత, శృతి హాసన్‌ నుండి రకుల్‌ ప్రీత్‌, రాశి ఖన్నా వరకు అందరూ బిజీయే. అందుకే ఎవరన్నా కొత్తమ్మాయితో సినిమా చేయాలనే ఆలోచన కూడా ఉంది. కాని కొత్తమ్మాయ్‌ అంటే పూరి స్పీడ్‌ను అందుకోవడం కష్టమే. మరి ఏం చేద్దాం? చూద్దాం నితిన్‌ ఏదో ఒకటి చేస్తాడులే.