Begin typing your search above and press return to search.

బాహుబలి.. పవర్‌ ఆఫ్‌ విమెన్‌

By:  Tupaki Desk   |   6 July 2015 9:54 AM GMT
బాహుబలి.. పవర్‌ ఆఫ్‌ విమెన్‌
X
ఓవైపు ప్రభాస్‌.. మరోవైపు రానా దగ్గుబాటి.. ఇంకోవైపు నాజర్‌, సత్యరాజ్‌, సుదీప్‌... ఇలా బాహుబలి సినిమాలో మేల్‌ క్యారెక్టర్లలో ఒకరిని మించిన వాళ్లు ఇంకొకరు. వాళ్లు పోషించిన పాత్రలు కూడా చాలా శక్తిమంతమైనవని మేకింగ్‌ వీడియోలు, ట్రైలర్‌ చూస్తేనే అర్థమవుతోంది. ఐతే ఈ సినిమాలో మేల్‌ క్యారెక్టర్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో లేడీ క్యారెక్టర్స్‌ ఉన్నాయని.. ఇండియన్‌ స్క్రీన్‌పై ఇంత బలమైన లేడీ క్యారెక్టర్స్‌ ఇంతకుముందెన్నడూ రాలేదని.. సినిమా విడుదలయ్యాక ఆ క్యారెక్టర్ల గురించే ఎక్కువ మాట్లాడుకుంటారని అంటున్నాడు బాహుబలి పాత్రధారి ప్రభాస్‌.

''బాహుబలి సినిమాలో స్ట్రాంగ్‌ హీరోయిజం, విలనిజం ఉన్నాయి. వాటితో పాటు లేడీ క్యారెక్టర్లన్నీ అంతకు మించి స్ట్రాంగ్‌గా ఉంటాయి. ది పవర్‌ ఆఫ్‌ విమెన్‌ ఏంటో బాహుబలిలో చూస్తారు. రమ్యకృష్ణగారు చేసిన శివగామి పాత్ర చూస్తే.. లేడీస్‌లో ఆమె కంటే పవర్‌ఫుల్‌ ఇంకెవరూ లేరేమో అనిపిస్తుంది. శివగామి పాత్ర చాలా బలంగా ఉండటమే కాదు.. మదర్‌ క్యారెక్టర్లో ఉండే డెప్త్‌ ఎంతో చూపిస్తుంది. అనుష్క చేసిన పాత్ర కూడా చాలా స్ట్రాంగ్‌. ఎంతో ధైర్యం, మనోనిబ్బరం ఉన్న పాత్ర అది. ఇక తమన్నా చేసిన అవంతిక క్యారెక్టర్‌కు సంబంధించి అందరూ క్యూట్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ లుక్‌ మాత్రమే చూశారు. కానీ సినిమాలో కొత్త అవంతికను చూస్తారు. కత్తి యుద్ధం చేస్తుంది. స్టంట్స్‌ చేస్తుంది. మర్డర్స్‌ కూడా చేస్తుంది. ఇంకా స్టన్నింగ్‌ లుక్స్‌లో కనబడుతుంది. రోహిణి గారు పోషించిన పాత్ర కూడా విమెన్‌ పవర్‌ను నిదర్శనంగా ఉంటుంది'' అని ప్రభాస్‌ చెప్పాడు.