Begin typing your search above and press return to search.

జక్కన్న దగ్గర అన్ని కథలున్నాయా?

By:  Tupaki Desk   |   5 July 2015 8:58 AM GMT
జక్కన్న దగ్గర అన్ని కథలున్నాయా?
X
ఒక సినిమా పూర్తయ్యాకగానీ మరో సినిమాకి కథ గురించి ఆలోచించరు చాలామంది దర్శకులు. అందుకే మధ్యలో విరామం వస్తుంటుంది. కానీ రాజమౌళి దగ్గర ఇప్పటికే బోలెడన్ని కథలున్నాయి. అవన్నీ వాళ్ల నాన్న విజయేంద్రప్రసాద్‌ రాసినవే. ఆయన కథ రాస్తే.. ఆ కథని గ్రాండియర్‌గా ఎలా తీయాలో ఆలోచిస్తూ ఉంటాడు రాజమౌళి. ఒక మామూలు కథని కూడా లార్జర్‌ దెన్‌ లైఫ్‌ తరహాలో భారీగా తీయడం రాజమౌళి శైలి. ఆక్కడే ఆయన విజయవంతమవుతున్నాడు. బాహుబలితో పాటు రాజమౌళి మనసులో మరో ఐదారు కథలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్‌ ఇంటర్వ్యూల్లో ఆ విషయాల్ని బయటపెట్టాడు.

ప్రభాస్‌నే శ్రీకృష్ణదేవరాయలుగా, అల్లూరి సీతారామరాజుగా, ఇంకా రాజుగా ఇలా రకరకాలుగా చూపించాలనుకొన్నాడట. వాటితో పాటు మరో రెండు మూడు కథలు చెప్పాడట. చూస్తుంటే రాజమౌళి దగ్గర స్క్రిప్టు బ్యాంకు బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాజమౌళి ప్రభాస్‌కి చెప్పిన కథల గురించి వింటుంటేనే అవి ఏ స్థాయిలో తెరకెక్కే సినిమాలో అర్థమవుతోంది. ఇప్పుడు ఆ కథల్లో ఒకటి మహేష్‌తో తెరకెక్కించాలని జక్కన్న ఫిక్స్‌ అయినట్టు తెలుస్తోంది. మరి శ్రీకృష్ణదేవరాయల కథనీ, అల్లూరి కథనీ రాజమౌళి ఎవరితో తీస్తాడో చూడాలి!