Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్

By:  Tupaki Desk   |   6 July 2015 1:06 PM GMT



జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ త‌న అభిప్రాయాలు వెల్లడించారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్‌, సెక్ష‌న్ 8 అంశాలు తెర‌మీద‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో త‌న మ‌నోభావాలు తెలిపారు.

- నా అభిప్రాయాలు నాకు ఉన్నాయి. కాని కావాలనే మాట్లాడలేదు.
- విభజన తర్వాత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని భావించాను కాబ‌ట్టే ఊరుకున్నాను. నోరు పారేసుకోకూడదన్న ఉద్దేశం నాది.
- కేసీఆర్ యాదాద్రి నిర్మాణానికి విజయనగరం జిల్లాకు చెందిన ఆనంద్ సాయిని ఆర్కిటెక్ట్ గా పెట్టుకోవడాన్ని అభినందిస్తున్నాను.
- తెలుగుజాతి ఐక్యత దేశానికి అవసరం. కేసీఆర్ నిర్ణ‌యం నాకు నచ్చింది
- నేను మాట్లాడడం లేదని అంటారు కాని కావాలని మౌనంగా ఉన్నాను.
- ప్రస్తుత రాజకీయాలు నీతి,నిజాయితికి అవకాశం లేని పరిస్థితి కనబడుతోంది.
- ఫోన్ టాపింగ్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
-సీఎమ్ ఫోన్ టాప్ అవడం తీవ్రమైన అంశం. దీనిపై సీబీఐ విచారణ జరగాలి.
- రేవంత్ రెడ్డి కేసులో కోర్టు నిర్ణయం జరగాలి.
- రేవంత్ వ్యవహారం చూస్తే, రాష్ట్రం రెండుగా విడిపోయిన సమయంలో ఇంత రాజకీయ క్రీడ ఆడే అవకాశం ఉందా అన్న ప్రశ్న వస్తోంది.
- రెండు రాష్ట్రాలకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆస్తుల పంపిణీ జరగలేదు, రాష్ట్రాలు తగాదా పడటం స‌రికాదు అని చెప్పాలని ఉంటుంది.
- ప్రజల అవసరాలను కాకుండా ఇతర విషయాలు ప్రధానంగా వస్తున్నాయి.
- ఇలాంటివాటికి పాల్పడితే రాష్ట్రాలు ఎక్కడ సమస్యలు తీర్చుకుంటాయి?
- ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టవలసి ఉంది.
- కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లారు. సనత్ నగర్ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు.
- ప్రజల సమస్యలను వదలి ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టరాదు.
- ప్రభుత్వాలు కొట్టుకుంటుంటే సివిల్ వార్ కు దారి తీస్తుంది.
- జల వివాదంతో రెండు ప్రాంతాల పోలీసులు కొట్టుకునే పరిస్థితి ఏర్పడడం స‌రికాదు. అది ప్రభుత్వాల వైఫల్యం.
- రెండు రాష్ర్టాల స‌మస్య‌ల‌పై ప్రధాని న‌రేంద్ర‌ మోడీ స్పందించాలి.
- చంద్రబాబును విమర్శించవచ్చు. పవన్ కళ్యాణ్‌ ను విమర్శించవచ్చు. కానీ ఆంధ్రులు అని అందరిని అనడం సరికాదు.
- ఆంద్రా ప్ర‌జ‌లంతా టీడీపీలో ఉండరు. ఆంధ్రా అంటే చంద్రబాబు సామాజికవర్గం ఒక్కటే కాదు. అనేక కులాలు, సమ్మేళనాలు ఉన్నాయి.
- ఆంధ్రులు అంటే కమ్మ సామాజికవర్గమే కాదు. మాల, మాదిగలు ఉంటారు.
- టీఆర్ఎస్ కు ఇష్ట‌మైన బొత్స స‌త్య‌నారాయ‌ణకు చెందిన కాపులు ఉన్నారు.
- చంద్రబాబుపై ఓటుకునోటు అభియోగం వస్తే సెక్షన్ 8 అవ‌స‌రం ప‌డిన‌ట్లు కాదు.
- కేంద్రం ఏపీకి అన్యాయం చేసింది కానీ అంత మాత్రాన, సెక్షన్ 8 పరిస్థితి వచ్చేలా చేయవద్దు.
- కేసీఆర్ కూడా రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజల మధ్య ఐక్యత తేవడానికి కృషి చేయాలి.
- సీమాంధ్రుల భ‌ద్ర‌త కోసం కేంద్రం క‌మిటీని నియ‌మించాలి.
- మీడియా స్వేచ్ఛ‌ను హ‌రించేలా నిర్ణ‌యం తీసుకోవ‌ద్దు.
- ఏపీలో కొన్ని చానెల్స్ బ‌హిష్క‌ర‌ణ స‌రికాదు.
- హైదరాబాద్ వంటి రాజధాని చేయాలని సీమాంద్ర పాలకులు ప్రయత్నిస్తున్నారు కానీ జనాన్ని అక్కడకు తీసుకు వెళ్లగలుగుతారా?
- హైదరాబాద్ పై హక్కుల కోసం కాకుండా, సీమాంద్ర కు ప్రయోజనం కలిగేలా నిర్ణ‌యం ఉండాలి.
- తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే కాని, ప్రత్యేక దేశం కాదన్న అభిప్రాయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ జనంలోకి తీసుకువెళ్లాలి.
- సెక్షన్-8 అమలుకు నేను వ్యతిరేకం.
- సెక్షన్-8 అమలు చేసి.. మళ్లీ తెలంగాణలో అల్లకల్లోలం సృష్టించ‌వ‌ద్దు.
- తిడితే కెసిఆర్ లా తిట్టాలని,తిట్లు పడితే సీమాంద్ర ఎమ్.పిల మాదిరి పడాలనే విధంగా ప‌రిస్థితి ఉంది.
- సీమాంద్ర ఎమ్.పిలకు పౌరుషం లేదా?
- సీమాంద్ర ఎమ్.పిలకు ఆత్మగౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారు.
- కేశినేని నాని విజయవాడ ఎమ్.పి సీటుకోసం ఎలా ఊగిపోయారో చూశాను. కానీ ఇప్పుడు ఏమి చేస్తున్నారు?
- పార్లమెంటు గోడలు చూస్తూ కాలం గడుపుతున్నారా?
- బీజేపీ ఏంపీలు ఇద్దరు హరిబాబాబు, గంగరాజు, కాకినాడ ఎమ్.పి తోట నరసింహం ఏమి చేస్తున్నారు?
- ప్ర‌ధాన‌మంత్రి మోడీ ఏమనుకుంటారో అనుకుని మాట్లాడకపోతే కుదరదు.
-కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు ఎందుకు కిక్కురుమనడం లేదు?
- వీరంతా ప్రత్యేక హోదా పై ఎందుకు మాట్లాడడం లేదు?
- తెలంగాణ ఎమ్.పిల మాదిరి పోరాడాలని అన్నారు.
-పోరాడలేకపోతే రాజీనామా చేయాలి.
- తమ వ్యాపారాలు కొంత పక్కన పెట్టి సీమాంద్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఎంపీలు మాట్లాడాలి.
- కావూరి సాంబశివరావు, పురందేశ్వరి ఇంకా ఏమీ మాట్లాడడం లేదు.