Begin typing your search above and press return to search.

'పటాస్‌'ను మించి పోయేట్లుందిగా..

By:  Tupaki Desk   |   30 Jun 2015 10:46 AM GMT
పటాస్‌ను మించి పోయేట్లుందిగా..
X
ఈ ఏడాది జనవరిలో ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై సెన్సేషనల్‌ హిట్టయింది పటాస్‌. వరుస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న కళ్యాణ్‌ రామ్‌కు హీరోగా, నిర్మాతగా ఓ 'పటాస్‌'ను ఓ మధుర జ్ఞాపకంగా మిగిల్చాడు కొత్త దర్శకుడు అనిల్‌ రావిపూడి. సినిమా హక్కులు కొద్దిపాటి లాభంతో దిల్‌ రాజుకు అమ్మేయడం వల్ల కళ్యాణ్‌ రామ్‌... కలెక్షన్ల ద్వారా పెద్దగా సొమ్ము చేసుకుందేమీ లేదు కానీ.. శాటిలైట్‌ రైట్స్‌, రీమేక్‌ రైట్స్‌ విషయంలో మాత్రం బాగానే కూడబెట్టుకున్నాడు. శాటిలైట్‌ ఎంతకు అయ్యిందన్నది క్లారిటీ లేదు కానీ.. 3-4 కోట్లకైతే తగ్గి ఉండదు. ఇక కన్నడ, తమిళ రీమేక్‌ రైట్స్‌ ఫ్యాన్సీ రేటే పలికాయి.

ఎస్‌.వి.బాబు అనే ఓ కన్నడ నిర్మాత సినిమా రిలీజైన కొన్ని రోజులకే మంచి రేటు పెట్టి కన్నడ రైట్స్‌ తీసుకున్నాడు. గోల్డెన్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న గణేష్‌ కథానాయకుడిగా.. స్టార్‌ డైరెక్టర్‌ మంజు స్వరాజ్‌ దర్శకత్వంలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అప్పుడే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ కూడా బయటికొచ్చింది. కళ్యాణ్‌ రామ్‌ లాగే మీసం మెలితిప్పి చాలా స్టయిలిష్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు గణేష్‌. ఈ సినిమా కన్నడలో 'పటాకి' పేరుతో తెరకెక్కుతోంది. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను అనిల్‌ రావిపూడి ట్విట్టర్లో షేర్‌ చేసి.. కన్నడ టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. పోస్టర్‌లో ఉన్న జోష్‌ చూస్తుంటే పటాకి.. పటాస్‌ను మించి పెద్ద హిట్టయ్యేలా కనిపిస్తోంది.