Begin typing your search above and press return to search.

మిస్‌ ఇండియానే.. ఏం లాభం..

By:  Tupaki Desk   |   1 July 2015 5:31 AM GMT
మిస్‌ ఇండియానే.. ఏం లాభం..
X
కొంతమంది అంతే.. పేరుకే మిస్‌ ఇండియా.. కాని మోడలింగ్‌లో రాణించినంత సినిమాల్లో రాణించలేరు. ఏదో చెప్పుకోవడానికి ఓ నలుగురు అన్నట్లు.. ఐశ్యర్య, సుస్మిత, ప్రియాంక, లారా దత్తా తప్పిస్తే.. మిస్‌ ఇండియా కిరీటం గెలిచి వచ్చి ఎంతమంది ఇక్కడ పెద్దగా ఊడబీకేస్తున్నారో మీకు తెలిసిందే. తనుశ్రీ దత్తా నుండి సయాలీ భగత్‌ వరకు.. సారా జేన్‌ డయాస్‌ నుండి మనస్వి మంగాయ్‌ వరకు.. ఎవ్వరూ పెద్దపెద్ద స్టార్లు కాదు కదా.. బిజీ యాక్టర్లు కూడా కాలేదు.

ఇదే కోవకి చెందిన మరో హాటీ నేహా ధూపియా. ఈ డిల్లీ భామ 2002లో ఫెమినా మిస్‌ ఇండియా కిరీటం గెలిచింది. ఇప్పుడేమో 34 ఏళ్ల వయస్సులో ఇంకేమైనా ఛాన్సులు వస్తాయేమో అంటూ అప్పుడప్పుడూ మ్యాగజైన్స్‌తో షూటు చేసుకుంటూ బిజీగా ఉంటుంది. ర్యాంప్‌పై నడవడం ఏమో కాని.. మ్యాగజైన్స్‌లో షూట్‌ అంటే చాలు పిచ్చెత్తిస్తుంది నేహా దూపియా. అమ్మడు నిన్ననే మ్యాగ్జిమ్‌ మ్యాగజైన్‌ కోసం విపరీతమైన అందాలను అరేసింది. చూస్తున్నారుగా.. యథావిథిగా క్లీవేజ్‌ సొగసుల నుండి నున్నటి ఆ కాళ్ళ వరకు అన్నీ అలా కెమెరాల ముందు ఆరబోస్తూ ఉంది. కుర్రాళ్లు చూసి ఓ రేంజులో సేదదీరుతూ ఉన్నా కూడా, ఫిలిం మేకర్లు మాత్రం ఛాన్సులు ఇవ్వట్లేదు... ఏం లాభం.