Begin typing your search above and press return to search.

భయపెట్టే ట్రెండ్‌లో నయన్‌ కూడా...

By:  Tupaki Desk   |   26 May 2015 1:30 AM GMT
భయపెట్టే ట్రెండ్‌లో నయన్‌ కూడా...
X
హారర్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తోందిప్పుడు. జ్యోతిక మొదలుకుని హన్సిక, అంజలి, స్వాతి.. ఇలా నాయికలంతా భయపెట్టే సినిమాలకే ప్రిఫరెన్స్‌ ఇస్తున్నారు. ఇదే బాటలో నయనతార కూడా ఒక హారర్‌ చిత్రంలో నటిస్తోంది. మాయ అనేది తమిళ టైటిల్‌. మయూరిగా తెలుగులోనూ రిలీజ్‌ చేస్తున్నారు. నిర్మాత సి.కళ్యాణ్‌ ఇటీవలే హన్సిక నటించిన హారర్‌ థ్రిల్లర్‌ 'చంద్రకళ'ను రిలీజ్‌ చేసి లాభాలు కళ్లజూశారు. ఆ ఉత్సాహంలోనే నయన్‌ నటిస్తున్న ఈ సినిమాని కూడా తెలుగులో నిర్మించి రిలీజ్‌ చేస్తున్నారు.

ఇటీవలే పెద్ద హీరో కమల్‌హాసన్‌ నటించిన ఉత్తమ విలన్‌ రిలీజ్‌ చేసి చేతులు కాల్చుకున్నారు కాబట్టి ఇప్పుడు హారర్‌ సినిమాయే తనని బతికిస్తుందని విశ్వసిస్తున్నారాయన. అంతేనా గతంలో పెద్ద హీరోల సినిమాలే తన చేతులు కాల్చాయని ఒప్పుకుని మరీ కథానాయికల సినిమాల్ని రిలీజ్‌ చేస్తునారాయన. ఏదేమైనా కాలిన చేతులపై బొబ్బల్ని చల్లార్చే మంత్రాంగం నయన్‌ వద్ద ఉందనే నమ్ముతున్నారు. అందుకు తగ్గట్టే కంటెంట్‌ ఉంటే సినిమా తెలుగులోనూ ఆడుతుంది. అశ్విన్‌ శరవణన్‌ అనేకొత్త కుర్రాడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ కానుంది.