Begin typing your search above and press return to search.

నారా రోహిత్‌.. మూడు సినిమాల ముచ్చట

By:  Tupaki Desk   |   12 Jun 2015 1:00 AM IST
నారా రోహిత్‌.. మూడు సినిమాల ముచ్చట
X
నేటి యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్‌.. ప్రస్తుతం 'అసుర' సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తూ వివిధ ప్రాంతాల్లో టూర్లు వేస్తున్నాడు. ఇప్పుడతడి చేతిలో ఐదు సినిమాలుండటం విశేషం. ఇందులో మౌనగురు (తమిళ) రీమేక్‌ శంకర ఫస్ట్‌ కాపీతో రెడీగా ఉంది. మరో తమిళ హిట్‌ మూవీ 'మాన్‌ కరాటె' రీమేక్‌కు ఓకే చెప్పాడు తప్ప దాని గురించి ఇంకే విశేషాలు తెలియవు.

రోహిత్‌ చేస్తున్న మిగతా మూడు సినిమాల గురించి ఆసక్తికర విశేషాలు చెప్పాడు. ''పండగలా వచ్చాడు.. నేను చేస్తున్న తొలి ఫుల్‌ లెంగ్త్‌ కమర్షియల్‌ ఎంటర్టైనర్‌. నేను ఆఫ్‌బీట్‌ సినిమాలే చేస్తానని.. కమర్షియల్‌ ఎంటర్టైనర్‌లు చేయనని అంటుంటారు. వాళ్లకు ఈ సినిమా సమాధానం. మూడు రోజుల షూటింగ్‌ మినహా మొత్తం పూర్తయింది. ఇక అసుర విడుదలయ్యాక ఆరంభించిన 'అప్పట్లో ఒకడుండేవాడు'లో నేనొక షాకింగ్‌ రోల్‌ చేయబోతున్నా. ఇందులో నాది ముస్లిం పాత్ర. ఇవి కాక సావిత్రి అనే ఫిమేల్‌ టైటిల్‌తో ఓ సినిమా చేయబోతున్నా. ఈ సినిమాకు ప్రేమ ఇష్క్‌ కాదల్‌ ఫేమ్‌ పవన్‌ సాధినేని దర్శకత్వం వహిస్తాడు. నా కెరీర్లో ఇదో భిన్నమైన సినిమా అవుతుంది'' అని చెప్పాడు రోహిత్‌.