Begin typing your search above and press return to search.

ప్యారిస్ వెళ్లనున్న నాగ్, కార్తి ల బృందం

By:  Tupaki Desk   |   1 July 2015 11:47 AM GMT
ప్యారిస్ వెళ్లనున్న నాగ్, కార్తి ల బృందం
X
తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఆ కోవలోనే టాలీవుడ్ కింగ్ నాగార్జున, తమిళ నటుడు కార్తి ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆసక్తికరమైన ఈ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా చెన్నై, హైదరాబాద్ లలో కొంత చిత్రీకరణ జరుపుకుంది. తాజాగా ఈ బృందం ఫ్లైట్ ఎక్కి ప్యారిస్ వెళ్ళనుందట.

ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్ సన్నివేశాలను ప్యారిస్, బెల్ గ్రేడ్ లలో చిత్రీకరిస్తారట. ఈ సినిమాలో ముఖ్యమైన కార్ చేజ్ సన్నివేశాలనూ ఈ షెడ్యూల్ లోనే పూర్తి చేస్తారట. బెల్ గ్రేడ్ లో షూటింగ్ జరుపుకోనున్న తొలి దక్షిణాది సినిమా ఇదేనట. మళ్ళీమళ్ళీ ఇది రానిరోజు పాటలు తెలుగు సంగీత ప్రియులను అలరించిన గోపీ సుందర్ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. గత సంవత్సరం సంక్రాంతికి విడుదలయిన ఎవడు సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని తమిళ తెలుగు భాషల్లో పివిపి బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. సంవత్సరాంతంలో సినిమాని విడుదల చెయ్యాలని నిర్మాత పొట్లూరి ప్రసాద్ భావిస్తున్నారు.