Begin typing your search above and press return to search.

చెర్రీ మమ్మీగా కాదు.. డైనమిక్‌ లేడీగా..

By:  Tupaki Desk   |   23 May 2015 9:30 AM GMT
చెర్రీ మమ్మీగా కాదు.. డైనమిక్‌ లేడీగా..
X
ఇటీవలి కాలంలో అనూహ్యంగా తెరపైకొచ్చి టాలీవుడ్‌నేలేస్తోంది అలనాటి మేటి నాయిక నదియా. తనదైన ఛరిష్మాతో మమ్మీ, సిస్టర్‌ పాత్రల్లో నటించి ఆకట్టుకుంటోంది. అప్పట్లో అత్తారింటికి దారేది చిత్రంలో పవర్‌ఫుల్‌ అత్తగా నటించి మెప్పించింది.. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్‌ కథానాయకుడిగా నటించిన రీమేక్‌ చిత్రం 'దృశ్యం'లో ఓ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా అదరగొట్టేసింది. ఇప్పుడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో చెర్రీకి మదర్‌గా నటిస్తున్నారని ఇటీవలి కాలంలో ప్రచారమైంది. తాజా అప్‌డేట్‌ ప్రకారం అది నిజం కాదని తెలుస్తోంది. నదియా ఈ చిత్రంలో ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో అభినయించబోతున్నారు. రచయితలు కోన వెంకట్‌, గోపిమోహన్‌ ఈ సినిమాకి కథ, మాటలు అందిస్తున్నారు. రకూల్‌ ప్రీత్‌సింగ్‌ ఈ చిత్రంలో కథానాయికగా ఆడిపాడుతోంది. కృతి కర్భంద చరణ్‌కి సోదరి పాత్రలో నటించబోతోంది. ఇప్పటికే నా పేరే రాజు అనే టైటిల్‌ని పరిశీలించినా బ్రూస్లీ అనే పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.