Begin typing your search above and press return to search.

అమ్మాయిలేం చేశారు తారక్‌ నిన్ను??

By:  Tupaki Desk   |   6 July 2015 4:20 PM GMT
అమ్మాయిలేం చేశారు తారక్‌ నిన్ను??
X
మొన్న టెంపర్‌లో అదే పని చేశాడు. ఇప్పుడు సుకుమార్‌ సినిమాతోనూ అదే పని చేస్తున్నాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఈ మధ్యకాలంలో మాస్‌ ఫ్యాన్స్‌ను ఒక్కరినే అలరించకుండా రూటు మార్చి దంచికొడుతున్నాడు కుర్రాడు. టెంపర్‌లో ఆల్రెడీ షర్టు విప్పేసి సిక్స్‌ప్యాక్‌ యాబ్స్‌ చూపించి ముఖ్యంగా అమ్మాయిలను టెంప్ట్‌ చేసేశాడు. ఇంత స్టయిలిష్‌గా తయారాయ్యడేంటమ్మా ఈ మాస్‌ సూపర్‌ స్టార్‌ అనుకుంటున్న సమయంలో ఈసారి స్టయిలిష్‌నెస్‌కు కొత్త బాస్యం చెబుతున్నాడు.

చూశారుగా ఆ స్టిల్స్‌లో ఎంత రాకింగ్‌గా ఉన్నాడు. కొత్తగా కటింగ్‌ చేయించిన హెయిర్‌ స్టయిల్‌.. అదేదో పొడుచుకొచ్చినట్లు ఉన్న వి-షేప్‌ గెడ్డం.. జేమ్స్‌బాండ్‌ టైపులో ఓ సూటు.. కళ్లకు మెరిసే కళ్లద్దాలు.. వామ్మో.. అబ్బాయిలకు అన్యాయం చేసి మళ్ళీ అమ్మాయిలను పడేస్తున్నాడు. ఎందుకు తారక్‌.. ఇలా అమ్మాయిలను ఉక్కిరిబిక్కిరి చేయడం నీకు న్యాయమా బాసూ.. ఇక మ్యాటర్‌లోకి వెళితే.. కుర్రాడు లండన్‌లో ఈ రేంజులో షూటింగ్‌ మొదలెట్టేశాడు. సుకుమార్‌ డైరక్షన్‌లో ఇక సెప్టెంబర్‌ 20 వరకు అక్కడే షూటింగ్‌. ఆ తరువాత ఓ ఇరవై రోజులు వేరే దేశంలో, ఓ 20 రోజులు ఇండియాలో షూటింగ్‌ చేసి.. సినిమాను సంక్రాంతికి తేవాలనేది ప్లాన్‌.