Begin typing your search above and press return to search.

'దండయాత్ర'కే ఫిక్సవుతారేమో!!

By:  Tupaki Desk   |   4 July 2015 5:30 PM GMT
దండయాత్రకే ఫిక్సవుతారేమో!!
X
ఎన్టీఆర్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రకరకాల కారణాలతో ఈ సినిమా చిత్రీకరణ వాయిదాలు వేస్తూనే ఉన్నారు. నిన్ననే ఎన్టీఆర్‌ లండన్‌ వెళ్లడంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు షూటింగ్‌ ప్రారంభమవుతోంది. హమ్మయ్య! ఇక హాయి అంటూ తారక్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యారు. ఎల్లుండి నుంచి సెట్స్‌కెళ్లనున్నారు. అయితే ఈ సినిమాకి టైటిల్‌ విషయంలో ఓ కొత్త సందేహం రాజేశారు నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌. ఫిలింనగర్‌లో ఇదో లేటెస్ట్‌ హాట్‌ టాపిక్‌.

తారక్‌ సినిమాకి ఇంతకాలం 'మా నాన్నకు ప్రేమతో' అనే టైటిల్‌ అనుకున్నారు. టైటిల్‌ వినడానికి బాగానే ఉన్నా మరీ సాఫ్ట్‌ అనిపించింది. టెంపర్‌, పోకిరి, బాద్‌షా టైపు టైటిళ్లకు ఉండే కిక్కు ఇందులో మిస్సయ్యిందని యువతరం భావించారు. అందుకే ఈ టైటిల్‌ బదులుగా వేరొక టైటిల్‌ని నిర్ణయిస్తే బావుంటుందని నిర్మాత బివిఎస్‌ఎన్‌ భావిస్తున్నట్టున్నారు. లేటెస్టుగా ఫిలింఛాంబర్‌లో 'దండయాత్ర' అనే టైటిల్‌ని రిజిష్టర్‌ చేయించారు. దండయాత్ర సౌండింగ్‌ అదిరిపోయింది. ఎన్టీఆర్‌ స్టామినాని ఎలివేట్‌ చేసేలా ఉంది. 'ఇది దండయాత్ర, దయాగాడి దండయాత్ర' అంటూ 'టెంపర్‌'లో ఎన్టీఆర్‌ ఉరుములా శత్రువుమీద పడిపోయే సన్నివేశం కళ్ల ముందు కనబడుతోంది. ఈ టైటిల్‌కి తిరుగే లేదు...

అసలే ఎన్టీఆర్‌ మాస్‌. అతడి బాడీ లాంగ్వేజ్‌ పక్కా మాస్‌. దానిని దృష్టిలో పెట్టుకునే సేఫ్‌సైడ్‌ ఈ టైటిల్‌ని రిజిష్టర్‌ చేశారనుకోవచ్చు. అయితే ఈ టైటిల్‌ని ఎన్టీఆర్‌ కోసమే రిజిష్టర్‌ చేశారా? లేక వేరే ఏదైనా ప్లాన్‌తో రిజిష్టర్‌ చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. కథ డిమాండ్‌ ప్రకారం 'దండయాత్ర' క్లిక్కవ్వకపోతే ఎవరూ ఏం చేయలేరు. అధికారికంగా ప్రకటించే వరకూ వెయిట్‌ అండ్‌ సీ.