Begin typing your search above and press return to search.

మోహన్ బాబు బూతు వాడేసారు ఏంటి ?

By:  Tupaki Desk   |   23 May 2015 11:31 AM GMT
మోహన్ బాబు బూతు వాడేసారు ఏంటి ?
X
దాసరి నారాయణరావు ఏ వేదిక ఎక్కినా చిన్న సినిమాల గురించే మాట్లాడుతుంటారు. పెద్ద నిర్మాతలపై, హీరోలపై ధ్వజమెత్తుతుంటారు. చిన్న సినిమాను చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అలా మాట్లాడుతూ ఎంతటి వాళ్లమీదైనా సెటైర్‌ వేయడానికి వెనుకాడరాయన. ఐతే కొన్ని రోజులుగా దాసరి కొంత మౌనం వహిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆయన శిష్యుడు మోహన్‌బాబు లైన్లోకి వచ్చినట్లున్నారు. గురువు దారిలోనే చిన్న సినిమాలకు మద్దతుగా గళం విప్పారు మోహన్‌బాబు. పనిలో పనిగా పెద్ద నిర్మాతల్ని కడిగేశారు.

దొంగాట సక్సెస్‌ మీట్‌లో భాగంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. ''నా దృష్టిలో నిజాయితీగా చిన్న సినిమాలు తీసేవాడు నిజమైన నిర్మాత. చిన్న సినిమాలే ఇండస్ట్రీకి ముఖ్యం. అలాంటి సినిమాలే తీయాలి. పెద్ద సినిమా తీస్తామని.. ఫైనాన్షియర్ల దగ్గర డబ్బులు తీసుకుని.. ఊరికే హంగామా చేసి.. విడుదల సమయానికి డబ్బులివ్వకుండా ఎగ్గొట్టేవాళ్లు పెద్ద నిర్మాతలు కాదు. అలా చేసేవాడు నా దృష్టిలో ఓ లఫూట్‌. ప్రస్తుతం మనదగ్గర పెద్ద నిర్మాతలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు. క్యారెక్టర్‌ వేషాలు వేసి ఈ స్థాయికి వచ్చినవాడిని. నాకు అందరి కష్టాలు తెలుసు. మనోజ్‌ పెళ్లి వ్యవహారాల్లో బిజీగా ఉండి ఇప్పుడిలా బయటికి వచ్చా. తర్వాత అన్ని విషయాల మీద మాట్లాడతా'' అంటూ తన ప్రసంగాన్ని ముగించారు మోహన్‌బాబు. ఇంతకీ కలెక్షన్‌ కింగ్‌ లఫూట్‌ అన్నది ఎవరినో!