Begin typing your search above and press return to search.

అదీ సూర్య రేంజ్‌

By:  Tupaki Desk   |   26 May 2015 1:30 PM GMT
అదీ సూర్య రేంజ్‌
X
సూర్యకు చివరగా దక్కిన నిఖార్సయిన హిట్టు ఏదో చెప్పడం కష్టం. అప్పుడెప్పుడో వచ్చిన 'వీడొక్కడే' తర్వాత మళ్లీ ఆ స్థాయిలో హిట్టు కొట్టలేదు సూర్య. ఘటికుడు ఫ్లాపవగా.. సెవన్త్‌ సెన్స్‌ ఓమాదిరిగా ఆడింది. బ్రదర్స్‌ ఫ్లాపవగా.. గత ఏడాది వచ్చిన 'సికిందర్‌' డిజాస్టర్‌ అనిపించుకుంది. అయినా సూర్య రేంజి ఏమాత్రం తగ్గలేదు. సూర్య కొత్త సినిమా రాక్షసుడు (తమిళంలో మాస్‌) బిజినెస్‌ చూస్తే కళ్లు చెదరక మానదు. విడుదలకు ముందే ఈ సినిమాకు అంతా కలిపి రూ.80 కోట్ల దాకా ఆదాయం రావడం విశేషం.

తమిళ వెర్షన్‌ తమిళనాడు థియేట్రికల్‌ రైట్స్‌ రూ.35 కోట్ల దాకా అమ్మగా.. ఓవర్సీస్‌ రైట్స్‌కు ఇంకో రూ.9 కోట్లు వచ్చాయి. తెలుగు వెర్షన్‌ హక్కులు రూ.10 కోట్లకు అమ్మినట్లు సమాచారం. కర్ణాటక, కేరళ, ఇండియాలోని మిగతా రాష్ట్రాల హక్కులు ఇంకో రూ.8 కోట్ల దాకా తెచ్చిపెట్టాయి. తమిళం, తెలుగు కలిపి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.61 కోట్ల బిజినెస్‌ జరిగింది. తమిళ శాటిలైట్‌ రైట్స్‌ రూ.15 కోట్ల దాకా పలికినట్లు సమాచారం. మ్యూజిక్‌ రైట్స్‌కు రూ.75 లక్షలు వచ్చాయి. తెలుగు శాటిలైట్‌ రైట్స్‌, ఇతర హక్కులు కలిపితే రూ.3 కోట్ల దాకా ఉంటాయి. మొత్తంగా అన్నీ కలిపితే రూ.80 కోట్ల లెక్క తేలింది. సౌత్‌ ఇండియాలో ఒక్క రజినీకాంత్‌కు మినహా ఏ హీరోకూ ఇంత సీన్‌ లేదు. దీన్ని బట్టే సూర్య రేంజేంటో అర్థం చేసుకోవచ్చు.