Begin typing your search above and press return to search.

తెలుగులో అడ్వాంటేజ్‌ కోసమేనా?

By:  Tupaki Desk   |   6 July 2015 7:30 PM GMT
తెలుగులో అడ్వాంటేజ్‌ కోసమేనా?
X
స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం చాలా వైఫల్యాల తర్వాత 'ఓకే బంగారం'తో విజయం అందుకున్నారు. ఈ సినిమాతో తెలుగు, తమిళ్‌ రెండుచోట్లా పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకున్నారు. అయితే సక్సెస్‌ సాధించాక కూడా ఇటీవలి కాలంలో చాలా విరామం తీసుకున్నారు. కారణం ఏదైనా ప్రస్తుతం తమిళ హీరో కార్తీతో సినిమాకి సన్నాహాలు చేస్తున్నారని ఆల్రెడీ చెప్పుకున్నాం.

ఇటీవలే కార్తీ మణి సర్‌ని కలిశాడు. ఇద్దరిమధ్యా కథా చర్చలు సాగాయి. అయితే ప్రాజెక్ట్‌ ఇంకా ఆరంభ దశలోనే ఉంది. కార్తీ ఇంతవరకూ ఒప్పంద పత్రంపై సంతకం పెట్టింది లేదు. కాని ఇక్కడ డిస్కస్‌ చేయాల్సిన విషయం ఏంటంటే.. మొన్ననే కొత్త కుర్రాడిని పరిచయం చేసిన మణి సార్‌ ఇప్పుడెందుకు కార్తీ వెంట పడ్డారనేది.. నిజానికి ఓకె బంగారం సినిమా తెలుగులో బాగా ఎక్కడానికి కారణాలు రెండు.. ఒకటి నాని వాయిస్‌, రెండోది నిత్యామీనన్‌. రెహమాన్‌ మ్యూజిక్‌ పెద్దగా చించేసింది ఏమీ లేదు. అందుకే ఈసారి తెలుగులో కూడా బీభత్సమైన పాపులార్టీ ఉన్న హీరో కోసం వెతికితే.. తెలుగులో మాంచి అడ్వాంటేజ్‌ ఉన్న తమిళ హీరోలు ఎవరా అని చూస్తే.. సూర్య, కార్తీ తప్పించి గురువుగారికి ఇంకో ఆప్షన్‌ అనేది దొరకలేదట.

వీళ్లిద్దరిలో మణి సర్‌ సినిమాలో చేయడానికి సూర్య రెడీగానే ఉన్నా.. మొన్ననే మూడు నాలుగు ఫ్లాపులు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మణిరత్నంతో వీణ వాయించడమంటే రిస్కే మరి. అందుకే తమ్ముడిని సజెస్ట్‌ చేశాడట. గతంలో సూర్య-మణి కాంబినేషన్‌లో యువ సినిమా వచ్చి అట్టర్‌ఫ్లాప్‌ అయ్యిందని తెలుసుగా.. ప్రస్తుతం నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్‌లో నటిస్తున్న కార్తీ.. మరి ఈ ప్రాజెక్టును ఫైనల్‌గా చేస్తాడో చేయడో అనే డౌట్‌ కూడా లేకపోలేదు.