Begin typing your search above and press return to search.

కొరటాల.. అతడితో కాదు.. ఇతడితో!

By:  Tupaki Desk   |   30 Jun 2015 10:42 AM GMT
కొరటాల.. అతడితో కాదు.. ఇతడితో!
X
డైరెక్టర్‌తో తొలి సినిమానే ప్రభాస్‌ లాంటి స్టార్‌ హీరోతో చేశాడు కొరటాల శివ. ఐతే మిర్చి సూపర్‌ హిట్టయినప్పటికీ.. అతడి రెండో సినిమా మొదలవడానికి చాలా టైమే పట్టింది. ముందు రామ్‌చరణ్‌తో సినిమా మొదలుపెట్టి.. అది ఆగిపోయాక మహేష్‌ బాబుతో సినిమా కన్ఫమ్‌ కావడానికి కూడా చాలా టైమే పట్టింది. ఐతే లేటైతే అయ్యింది కానీ.. మహేష్‌తో సినిమా మాత్రం మిస్సవలేదు. ప్రస్తుతం 'శ్రీమంతుడు' పూర్తి చేసి దాన్ని విడుదల చేసే పనిలో ఉన్న కొరటాల.. తన మూడో సినిమా విషయంలో మాత్రం ఆలస్యం కాకూడదనుకుంటున్నాడు.

ఐతే ఈ సినిమా విషయంలోనూ కొరటాలను కన్ఫ్యూజన్‌ వదలట్లేదు. ముందేమో అల్లు అర్జున్‌తో సినిమా అనుకున్నాడు. కథ కూడా ఓకే అయింది. కొరటాల శ్రీమంతుడు' పూర్తి చేసేలోపు బన్నీ బోయపాటితో సినిమాను ఓ కొలిక్కి తెచ్చేస్తాడని అనుకున్నాడు. కానీ ఇప్పటికీ బోయపాటి శ్రీను సినిమా మొదలే కాలేదు. ఆ సినిమా విషయంలో కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్న బన్నీ.. కొరటాల శివ సినిమాకు ఒకే చెప్పట్లేదు. దీంతో కొరటాల మరోసారి మెగా హీరో సినిమాకు దూరం కాక తప్పేలా లేదు. ప్రస్తుతానికైతే కొరటాట-బన్నీ సినిమా పక్కకు వెళ్లిపోయినట్లే. ఇదే కథతో చేయబోతున్నాడా.. వేరే కథ అనుకున్నాడా అన్నది తెలియడం లేదు కానీ.. కొరటాల తర్వాతి సినిమా ఎన్టీఆర్‌తో ఉండబోతోందట. ఇటీవలే కొరటాల ఎన్టీఆర్‌కు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడని.. వచ్చే ఏడాది ఆరంభంలో ఆ సినిమాకు కొబ్బరికాయ కొట్టొచ్చని సమాచారం.