Begin typing your search above and press return to search.

బాలయ్యను కొత్త ఒరవడిలో చూపిస్తా

By:  Tupaki Desk   |   26 May 2015 3:30 AM GMT
బాలయ్యను కొత్త ఒరవడిలో చూపిస్తా
X
టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలందరితో స్నేహంగా ఉండే స్టార్‌ రైటర్‌ కోన వెంకట్‌. పవన్‌, చరణ్‌, మహేష్‌, బన్ని, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, గోపిచంద్‌, రవితేజ.. ఇలా హీరోలందరితో అతడికి సాన్నిహిత్యం ఉంది. ఈ జాబితాలో ఇంచుమించు అందరితో పనిచేశాడు. అయితే అతడు నటసింహా బాలయ్యతో ఇంతవరకూ పనిచేయలేదు.

బాలయ్యతో 16ఏళ్ల స్నేహం ఉన్నా ఆ అదృష్ట ఘడియ రానేలేదు. ఇంతకాలానికి బాలయ్య నటించే 99వ సినిమాకి పని చేసే అవకాశం, అదృష్టం కోన అందుకున్నారు. ఈ శుభవేళ ఆనందంతో కోన ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. బాలయ్యబాబుతో 16ఏళ్ల స్నేహం ఉండీ, ఐదేళ్లుగా సినిమా చేద్దామని అనుకుంటున్నా.. కుదరలేదు. ఇన్నాళ్టికి డిక్టేటర్‌ సినిమా కోసం పనిచేస్తున్నా. నేను, గోపిమోహన్‌ ఓ ఛాలెంజ్‌గా తీసుకుని చేస్తున్న సినిమా ఇది. నటసింహం నటించిన ఎన్నో బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ మా ముందు చాలెంజ్‌గా ఉన్నా ఒత్తిడిలకు లోనుకాకుండా బాలయ్యను కొత్త ఒరవడిలో చూపించేందుకు ప్రయత్నిస్తాం. బాలయ్య హీరోయిజానికి మా మార్క్‌ వినోదం జోడిస్తాం. శ్రీవాస్‌ దర్శకత్వంలో ఓ కొత్త మార్క్‌ సినిమాని అందిస్తాం.. అని ఛాలెంజ్‌ చేశాడు కోన.

అంటే బాలయ్యను ఓ రేంజులో టోన్‌డౌన్‌ చేసి పకడ్భందీ స్క్రిప్టులో హీరోయిజాన్ని ఇన్‌బిల్ట్‌ చేసి హిట్‌ కొట్టాలని మ్యాప్‌ వేశాడన్నమాట! పైగా విమర్శకుల నోళ్లకు తాళం వేసే కనికట్టు చేయబోతున్నాడని కూడా భావిద్దాం.