Begin typing your search above and press return to search.

ఆడియో హంగామా.. ఆపై అడ్రస్‌ లేరు

By:  Tupaki Desk   |   25 May 2015 3:30 AM GMT
ఆడియో హంగామా.. ఆపై అడ్రస్‌ లేరు
X
పెద్దగా హంగామా లేకుండా సైలెంటుగా 'కిక్‌-2' షూటింగ్‌ అవగొట్టేశాడు సురేందర్‌ రెడ్డి. షూటింగ్‌లో ఉన్నన్నాళ్లూ ఈ సినిమా గురించి పెద్దగా హైప్‌ లేదు. కానీ ఆడియో ఫంక్షన్‌తో ఒక్కసారిగా ఊపు వచ్చేసింది. ఆ ఫంక్షన్‌ను కళ్యాణ్‌రామ్‌ చాలా గ్రాండ్‌గానే చేశాడు. ఆడియో, ట్రైలర్‌ కూడా ఆకట్టుకోవడంతో ఓ వారం పాటు 'కిక్‌-2' వార్తల్లో నిలిచింది. ఈ ఊపులోనే రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేస్తారులే అనుకుంటే కళ్యాణ్‌ రామ్‌ అండ్‌ కో ఆ ఊసే ఎత్తట్లేదు. ఆడియో ఫంక్షన్‌తో వచ్చిన హైప్‌ అంతా తగ్గిపోయిందిప్పుడు. కిక్‌-2 వార్తల్లోనే లేదు.

ట్విట్టర్లో కానీ.. మీడియాలో కానీ.. కిక్‌-2 టీమ్‌ కిక్కురుమనట్లేదు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కూడా అయిపోయిందని.. సెన్సార్‌ చేసుకుని సినిమాను రిలీజ్‌ చేయడమే ఆలస్యమని ఆడియో ఫంక్షన్‌ టైంలో వార్తలొచ్చాయి. కానీ సినిమా విషయంలో ఏం జరుగుతోందో కానీ.. బంగారం లాంటి సమ్మర్‌ సీజన్‌ను వృథా చేసుకున్నారు. జూన్‌ 5 వరకు వేరే వేరే సినిమాలు షెడ్యూల్‌ అయిపోయాయి. రెండో వారానికి రిలీజ్‌ అనుకుని ఉన్నా ఆ సూచనలేమీ కనిపించట్లేదు. ఈ మధ్య చాలా తెలుగు సినిమాలకు ఇలాగే జరుగుతోంది. ఆడియో ఫంక్షన్‌కు రచ్చ రచ్చ చేస్తారు. ఆపై అడ్రస్‌ లేకుండా పోతారు. మంచి అంచనాలున్న కిక్‌-2 సినిమాకు కూడా ఇలాగే జరుగుతుండటం ఆశ్చర్యకరం.