Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సుత్తి పట్టుకున్న సెక్సిణి

By:  Tupaki Desk   |   30 Jun 2015 7:56 AM GMT
ఫోటో స్టోరి: సుత్తి పట్టుకున్న సెక్సిణి
X
శిలల్లోంచి ప్రాణంతో లేచొచ్చిన శిల్పానివా? ఎవెంజర్స్‌ పుట్టించిన అల్ట్రా మోడ్రన్‌ కన్యకవా? క్యాట్‌ లేడీ, బ్యాట్‌ మేన్‌ చెల్లెలు, సూపర్‌మేన్‌ ప్రేయసి.. వీళ్లలో ఎవరైనా ఒకరై ఉంటావా? ఏమో ఎవరికి ఎరుక? అయినా ఇలా గుడ్డు పగలగొట్టుకుని పక్షిలా బైటికొచ్చావేంటి? ఇలాంటి సందేహాలు ఉంటే కాస్త ఆగాల్సిందే.

క్వీన్‌ కంగన ఇలా మారిపోయిందేంటి? ఉన్నట్టుండి ఈ మార్పునకు కారణం? ఏదేమైనా అసలు ఆ ఫోజిచ్చిన తీరు ఎన్నో కొత్త సందేహాలకు దారి తీస్తోంది. ఇప్పటివరకూ కంగన క్వీన్‌, తను వెడ్స్‌ మను లాంటి నాయికా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించింది. అప్పట్లో క్రిష్‌ 3లోనూ అదే తరహాలో ఆకట్టుకునే పాత్రలో మెప్పించింది. ఇక ముందు వీటన్నిటికీ ఎక్స్‌టెన్షన్‌గా ఎవెంజర్‌ కన్యకలా నటించబోతోందా అన్న సందేహాలొస్తున్నాయి ఈ ఛాయా చిత్రం చూస్తుంటే.

కంగన భారీ ఆయుధం (సుత్తి) పట్టుకుని భవిష్యత్‌ సినిమాకి సింబాలిక్‌గా నిలిచింది. ఇక నుంచి ఈ ప్రపంచమంతా లేడీస్‌దే అన్నట్టు ఆ వెనకగా బ్యాక్‌గ్రౌండ్‌ డిజైన్‌ సిగ్నల్‌ ఇస్తోంది. వజ్రపు కాంతుల ధగధగల డిజైనర్‌వేర్‌లో కంగన సరికొత్తగా కనిపిస్తోంది. 'జూమ్‌ టర్న్‌ ఆన్‌ ది న్యూ' కాన్సెప్ట్‌ బావుంది కదూ!