Begin typing your search above and press return to search.

అదే ఈ దేశం దౌర్భాగ్యం: కమల్‌హాసన్‌

By:  Tupaki Desk   |   29 Jun 2015 5:39 AM GMT
అదే ఈ దేశం దౌర్భాగ్యం: కమల్‌హాసన్‌
X
దేశంలోని ప్రతి చిన్న కుటుంబం సమాజం నుంచి థ్రెట్‌ని ఎదుర్కోవాల్సిందే. పిల్లల విద్యావ్యవస్థ భ్రష్టు పట్టి ఉంది. చదివినా ఏ ప్రయోజనం లేదు. స్కూలు ఫీజులే కట్టలేని దౌర్భాగ్యం. అలాగే రాజకీయాలు భ్రష్టు పట్టి ఉన్నాయి. నాయకుల ఫిలాసఫికల్‌ మెదడ్స్‌ కామన్‌ జనాల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాయి. చట్టం, న్యాయం అనేవి ఎవరికి ఉపయోగపడుతున్నాయ్‌? అని ఆవేదన వెళ్లగక్కారు కమల్‌హాసన్‌. ఈ శుక్రవారం అతడు నటించిన 'పాపనాశం' (దృశ్యం రీమేక్‌) రిలీజవుతున్న సందర్భంగా ఈ చిత్రం గురించి బోలెడన్ని విషయాల్ని ముచ్చటించారు.

= 'పాపనాశం' నా కెరీర్‌లోనే ఎంతో చక్కని సినిమా. తన కుటుంబాన్ని ఓ ప్రమాదం నుంచి కాపాడుకునే ఓ కామన్‌ మ్యాన్‌గా నటించాను. నేను కూడా నిజజీవితంలో కామన్‌మేన్‌నే కాబట్టి ఈ చిత్రంలో నటించా.

=నేను ఈ చిత్రంలో ఇద్దరు ఆడపిల్లలకు తండ్రిగా నటించాను. ఒకవేళ నిజజీవితంలో ముగ్గురు మగ పిల్లలకు తండ్రినే అయినా ఈ దేశంలో జాగ్రత్తగానే ఉండాలి. ఇక్కడ రాజకీయాలు అలాంటివి. ఇక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి మరి.

=మహానంది చిత్రంలో ఆడబిడ్డ తండ్రిగా నటించాను. కానీ ఆ సినిమాని నా దర్శకుడు జీతూ చూసి ఉంటాడని అనుకోను. యాధృచ్ఛికంగానే ఈ సినిమాకి సంబంధించిన పయనం మొదలైంది. సినిమా అద్భుతంగా వచ్చింది.

=గౌతమి కంబ్యాక్‌ సినిమాలో చక్కగా నటించింది. ఆడవాళ్ల జీవితాల్లో బోలెడన్ని ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించి చివరికి రిటైర్‌మెంట్‌ టైమ్‌కి వచ్చింది. అయినా రీఎంట్రీ బాగుంది. నా పిల్లలుగా నటించినవాళ్లు బాగా పెర్ఫామ్‌ చేశారు.

=హిందీలో అజయ్‌దేవగన్‌ నటించిన 'దృశ్యం' రిలీజవుతోంది. అయితే నేను దేవగన్‌కి పోటీ కాదు. ఎవరి మార్కెట్‌ వాళ్లకు ఉంది.