Begin typing your search above and press return to search.

పబ్బులోకి వెళుతున్న చీకటిరాజ్యం

By:  Tupaki Desk   |   30 Jun 2015 7:30 PM GMT
పబ్బులోకి వెళుతున్న చీకటిరాజ్యం
X
ఇటీవలి కాలంలో ఫిలింవర్గాల్లో ఎక్కువగా చర్చకొచ్చిన సినిమా చీకటి రాజ్యం. ఫస్ట్‌లుక్‌తోనే జనాల్లో అటెన్షన్‌ పెంచారు మేకర్స్‌. ఇది తెలుగు, తమిళ్‌ ద్విభాషా చిత్రం. తూంగవనం టైటిల్‌తో తమిళ్‌లో తెరకెక్కుతోంది. తెలుగులో చీకటిరాజ్యం పేరుతో తెరకెక్కుతోంది.

ప్రస్తుతం ఈ సినిమాపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాడు విశ్వనటుడు కమల్‌హాసన్‌. చిత్రీకరణ ప్రస్తుతం విజిపి గోల్డెన్‌ బీచ్‌లోని ఓ పబ్‌ సెట్‌లో జరుగుతోంది. పబ్బులో షూటింగ్‌ కాబట్టి.. షూట్‌ అంతా రాత్రివేళలోనే. ఓ పోలీస్‌ అధికారి తనయుడు పబ్‌లో బంధిఖానా అవుతాడు. కొడుకును రక్షించుకోవడానికి ఆ కాప్‌ ఎలాంటి విఫలయత్నం చేశాడన్నదే సీన్‌. కాన్సెప్టు ప్రకారం ఈ సన్నివేశాన్ని రాత్రివేళలోనే తెరకెక్కించాలి. త్రిష, కిషోర్‌ కుమార్‌ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పోలీస్‌ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనే సన్నివేశాల్ని వీరందరిపై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 'స్లీప్‌లెస్‌ నైట్‌' అనే ఫ్రెంచి చిత్రానికి రీమేక్‌ అని చెబుతున్నారు. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉందింకా. పబ్బులో చీకటి రాజ్యం అన్నమాట!

ఇకపోతే తొలిసారిగా కమల్‌ సరసన త్రిష హీరోయిన్‌గానే కాదు.. ఓ పోలీస్‌ ఆఫీసర్‌గా కూడా కనిపిస్తోంది. ఈ పబ్‌లో కనిపించే యాంబియన్స్‌ కంటే ఆ కిక్‌ ఇంకా ఎక్కువగా ఉందమ్మోయ్‌.