Begin typing your search above and press return to search.

అభినవ అతిలోక సుందరి కాజల్‌

By:  Tupaki Desk   |   29 Jun 2015 5:54 AM GMT
అభినవ అతిలోక సుందరి కాజల్‌
X
కాజల్‌ తమిళంలో బిజీస్టార్‌. అక్కడ స్టార్‌ హీరో ధనుష్‌ సరసన 'మారి' అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా సినిమా సంగతులతో పాటు చాలా ఆసక్తికర విషయాల్నే టచ్‌ చేసింది. ''మారి చిత్రంలో నా క్యారెక్టర్‌ పేరు శ్రీదేవి (అతిలోక సుందరి). నేనో ఫ్యాషన్‌ డిజైనర్‌ని. ఓ చిన్న టౌన్‌లో బొటిక్‌ నడిపిస్తుంటా. ఆ బొటిక్‌ వల్లే ధనుష్‌ పరిచయం అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెరపైనే చూడాలి'' అనేస్తోంది అమ్మడు.

ధనుష్‌తో పనిచేయడం గొప్ప అనుభవం. అలాంటి డౌన్‌ టు ఎర్త్‌ హీరోని ఇంతవరకూ చూడనేలేదు. ఒక జాతీయస్థాయి నటుడితో నటించిన అనుభవాన్ని మర్చిపోలేను. తన నుంచి బోలెడన్ని విషయాల్ని నేర్చుకున్నానంటూ పొగిడేసింది. అలాగే ఈ చిత్రంలో పావురాలతో కొన్ని సీన్లు ఉన్నాయి. వాటితో పనిచేయడం నిజంగా గుబులు గుబులుగా అనిపించింది. మూగ జీవాల్ని ప్రేమించడం తెలుసు కానీ, వాటితో సన్నిహితంగా ఉన్న సందర్భమే లేదు. అందుకే పావురాలతో వింత అనుభవం భయపెట్టింది. పావురాల్ని టచ్‌ చేసినప్పుడు అవి రెక్కలు విప్పి టపటపా కొట్టుకుంటాయి. అలాంటి సందర్భంలో ఎంతో భయపడేదాన్ని.. అంటూ చెప్పుకొచ్చింది. అది సంగతి.