Begin typing your search above and press return to search.

స్వీట్‌ వాయిస్‌తో అడ్డంగా బుక్‌ చేసేస్తారు

By:  Tupaki Desk   |   4 July 2015 9:55 AM GMT
స్వీట్‌ వాయిస్‌తో అడ్డంగా బుక్‌ చేసేస్తారు
X
బాధ్యతాయుతంగా.. సమాజంలో జరిగే మంచిచెడుల గురించిన ఘటనల్ని బయటకు తీసుకొచ్చి.. వీలైనంత మందికి మంచి జరిగేలా చూసుకోవాల్సిన పాత్రికేయ వృత్తిలో ఉండి.. దాన్ని వదిలేసి.. తేరగా డబ్బులు సంపాదించటం మీద దృష్టి పెట్టిన నలుగురు ఊరుపేరు తెలియని ఛానళ్లకు పని చేస్తున్న నలుగురి దుష్ట జర్నలిస్టుల కథ ఇది.

మగాళ్లలో ఉండే బలహీనతల్ని అసరా చేసుకొని వారిని అడ్డంగా బుక్‌ చేసి లక్షలు దండుకునే ప్రయత్నం తాజాగా బయటపడింది. ఇప్పటికే పలువుర్ని బోల్తా కొట్టించి కాసులు కొల్లగొట్టిన వారి పాపం తాజాగా పండింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఈ దుర్మార్గుల వ్యవహారం చూస్తే..

ఊరు.. పేరు తెలియని నాలుగు ఛానళ్లలో పని చేసే జర్నలిస్టులు (?) ఒక సిండికేట్‌గా తయారయ్యారు. సమాజంలో కాస్తంత పలుకుబడి.. డబ్బులున్న పార్టీలను గురించి.. వారి ఫోన్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తారు. ఎవరో ఫోన్‌ చేశారని భావించి తిరిగి ఫోన్‌ చేయటం.. అవతలవైపు నుంచి ఒక స్వీట్‌ వాయిస్‌ ట్రాప్‌ వేసే ఉద్దేశ్యంతో మాటల ముగ్గులోకి దింపుతారు.

చివరకు సినిమా ఏకాంతంగా కలుసుకునే వరకూ తీసుకొస్తారు. అలా ఏకాంతంగా కలిసే సమయానికి వారు కలిసే ప్రదేశంలో కెమేరాలు ఏర్పాటు చేయటం కానీ.. లేదంటే.. వారు అలా ఏకాంతంలోకి వెళ్లిన మరుక్షణం.. ఆలస్యం చేయకుండా వారి తలుపు తట్టటం.. తలుపు తీసిన వారికి షాక్‌ ఇస్తూ.. నలుగురు కెమేరాలతో షూట్‌ చేయటం.. తర్వాత బ్లాక్‌మొయిల్‌ చేసి లక్షలు దండుకోవటం ఒక అలవాటుగా మార్చుకున్నారు.

ఇప్పటికే పలువుర్ని బుక్‌ చేసిన వారు.. ఇళ్లు.. లాడ్జీలు.. కొన్ని ప్రైవేటు ప్రాంతాల్లో ఇలా కెమేరాలతో హడావుడి చేసి లక్షలాది రూపాయిలు కొల్లగొట్టారు. తాజాగా వరంగల్‌ జిల్లాకు చెందిన ఒక ఉపాధ్యాయుడ్ని సైతం ఇలానే ట్రాప్‌ చేశారు. రూ.5లక్షలు డిమాండ్‌ చేశారు. చేసిన తప్పునకు లెంపేసుకొని.. తన పేరు బయటకు ఆరకుండా ఉండేందుకు అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చేందుకు ఓకే చెప్పేసినప్పటికీ.. అతగాడికి సంబంధించిన సమాచారం టీవీల్లో వచ్చేసింది.

దీంతో కడుపు మండి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటం.. వారు దృష్టి సారించటంతో కథ మొత్తం బయటకు వచ్చింది. ఏ విధంగా ట్రాప్‌ చేస్తారన్న విషయాన్ని గుర్తించి వారిని బుక్‌ చేశారు పోలీసులు. పాపం ఏదో ఒక రోజు పండకపోదంటే ఇదేనేమో.