Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అక్కీ సరస జాకీ సల్లాపం

By:  Tupaki Desk   |   2 July 2015 7:30 PM GMT
ఫోటో స్టోరి: అక్కీ సరస జాకీ సల్లాపం
X
శ్రీలంకన్‌ బ్యూటీ జాక్విలిన్‌ రోజు రోజుకి షైన్‌ అయిపోతోంది. సల్మాన్‌ కిక్‌తో కిక్కిచ్చే హిట్‌ కొట్టిన ఈ అమ్మడు వరుసగా స్టార్‌ హీరోల సినిమాలకు సంతకాలు చేస్తోంది. ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోలుగా తెరకెక్కుతున్న బ్రదర్స్‌ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇదిగో ఇక్కడున్న ఈ స్టిల్‌ చూస్తుంటే ఓ రేంజులో కిక్కిస్తోంది కదూ? జాక్విలిన్‌ టూ పీస్‌ బికినీలో బాస్‌ అక్షయ్‌ని అల్లేసుకుంటోంది.

బీచ్‌ రిసార్టులో ఏకాంత వేళ ఏకాంత సేవల్ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నాడు అక్కీ. మగవతో రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్నాడు. ఈ సీన్‌లో అక్కీ కూడా అంతే హాట్‌గా కనిపిస్తున్నాడు. పిక్కలపైకి ఇన్‌వోర్‌తో కనిపించి మగువలకు కంటి మీద కునుకే లేకుండా చేస్తున్నాడు. జాక్విలిన్‌తో నువ్వా నేనా? అంటూ ఎక్స్‌పోజింగ్‌ చేస్తున్నాడు. ఫెమీనా మిస్‌ ఇండియా స్విమ్‌ సూట్‌ కాంటెస్టులో కనిపించనంత సౌందర్యం, గ్లాడ్‌ రాగ్స్‌, ఎఫ్‌హెచ్‌ఎం కవర్‌పేజీలో కనిపించనంత సోయగం లేక్‌ వ్యూ రొమాన్స్‌లో కనిపిస్తోంది. భామతో బాస్‌ కలాపం అదిరిపోయింది. అక్కీకి, జాకీకి మరో హిట్‌ షూరూ అనిపిస్తోంది.