Begin typing your search above and press return to search.

ఆ కుర్రాడికి మొగుడవ్వాలని...

By:  Tupaki Desk   |   23 May 2015 1:50 PM GMT
ఆ కుర్రాడికి మొగుడవ్వాలని...
X
ముంబయిలో ఇటీవల %షష%గే వరుడు కావలెను%''% అంటూ ప్రచురితమైన మేట్రిమోనియల్‌ ప్రకటనకు మంచి స్పందన వచ్చిందట. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుంచి 73 సంబంధాలు వచ్చాయట. ముంబయిలో హరీశ్‌ అనే గే అబ్బాయి కోసం ఆయన తల్లి పద్మ అయ్యర్‌ ఈ ప్రకటన ఇచ్చారు. అయ్యర్లకు ప్రాధన్యం అని ప్రకటనలో పేర్కొనడంతో అయ్యర్ల నుంచే ఎక్కువగా స్పందన వచ్చిందట. ప్రకటన దెబ్బకు హరీశ్‌ కు మొగుడయ్యేందుకు చాలామంది ఆసక్తి చూపించారు.

ఆస్ట్రేలియా, యూకే, అమెరికాల నుంచే కాకుండా సౌదీ అరేబియానుంచి మంచి స్పందన వచ్చిందని హరీశ్‌ చెబుతున్నారు. అయ్యర్లతోపాటు గుజరాతీలు, ముస్లింలు చాలా మంది మెయిల్‌ చేశారట. అబుదాబి నుంచి ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటే ఆయనకున్న రాజభవనంలాంటి ఇల్లు రాసిస్తానన్నారని హరీష్‌ చెప్పారు. ఇంకేముంది వచ్చిన సంబంధాల్లో ఏదో ఒకటి మంచిది చూసుకుని పెళ్లి చేసుకుని కాపురం చేసుకోవడమే తరువాయి.