Begin typing your search above and press return to search.

300 దించేశారు.. కానీ బావుందే

By:  Tupaki Desk   |   3 July 2015 4:13 AM GMT
300 దించేశారు.. కానీ బావుందే
X
ఓ ప్రముఖ హాలీవుడ్‌ పత్రిక బాహుబలిని ఆకాశానికెత్తేసింది. భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రమిదని కొనియాడింది. షారూక్‌ఖాన్‌ నటించిన రా-1 చిత్రం 27 మిలియన్‌ డాలర్లతో తెరకెక్కింది. బాహుబలి రెండు భాగాలు కలిపి 40 మిలియన్‌ డాలర్లతో తెరకెక్కుతోంది. ఇప్పటివరకూ దేశంలోనే భారీ పెట్టుబడితో తెరకెక్కిన చిత్రమిదని బాహుబలిని ప్రశంసించింది. అంతేనా లాస్‌ ఏంజిల్స్‌కి చెందిన సదరు పత్రిక బాహుబలికి చెందిన ఓ పోస్టర్‌ని కూడా వేసింది.

బాహుబలి సరిక్రొత్త పోస్టర్‌లో ప్రభాస్‌ లుక్‌ని హైలైట్‌ చేసిన తీరు అదిరింది. శత్రు సైన్యం మీదికి తన పొడవాటి ఆయుధంతో ఉగ్ర రూపాన్ని దూస్తున్న ఈ దృశ్యాన్ని ఈ పోస్టర్‌లో ఆవిష్కరించారు. ఓ రకంగా ప్రభాస్‌ని ఈ పోస్టర్‌లో చూస్తుంటే 300 సినిమాలోని కింగ్‌ లినైడస్‌ కనిపిస్తున్నాడు. కాసేపు మహాభారతంలో అర్జునిడిలా.. ఇంకో యాంగిల్‌ నుండి ర్ణుడిలా కనిపిస్తున్నాడు బాహుబలుడు. ఒక ప్రాంతీయ సినిమాలో నటించిన హీరో ఈ రేంజులో కనిపించడం అన్నది అసాధారణమైన విషయం. ఇకపోతే ప్రభాస్‌ లుక్‌ గురించి రాజమౌళి, రమా, మిగిలిన టీమ్‌ అంతా క్రెడిట్‌ తీసుకుంటారో.. పోస్టర్లను డిజైన్‌ చేసిన మార్చింగ్‌ యాంట్స్‌ సంస్థకు కూడా అంతే క్రెడిట్‌ దక్కుతుంది.