Begin typing your search above and press return to search.

స్టీఫెన్సన్ పై హైకోర్టు ఫైర్

By:  Tupaki Desk   |   29 Jun 2015 8:59 AM GMT
స్టీఫెన్సన్ పై హైకోర్టు ఫైర్
X
ఓటుకు నోటు కేసులో సంచలనానికి కారణమైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు హైకోర్టులో చుక్కెదురైంది. న్యాయమూర్తిని మార్చాలన్న నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది.

ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడైన మత్తయ్య కొద్ది రోజుల క్రితం న్యాయస్థానంలో ఓ పిటిషన్ దాఖలు చేశారు.. తన అరెస్టుపై స్టే ఇవ్వాలని... ఈ కేసు నుంచి తనను తప్పించాలని ఆయన కోరారు. దీనిని స్టీఫెన్ సన్ హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన హైకోర్టు స్టీఫెన్సన్ పిటిషన్ కొట్టివేసింది. ఈ సందర్భంగా పదునైన వ్యాఖ్యలూ చేసింది. స్టీఫెన్సన్ కోర్టును తప్పుదోవ పట్టించారని అంటూ అదే బెంచ్ లో కేసు విచారణ జరుగుతుందనీ స్పష్టం చేసింది. స్టీఫెన్ సన్ పైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

స్టీఫెన్ సన్ పైన కోర్టు ధిక్కారు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. స్టీఫెన్సన్ పైన కేసు నమోదు చేయాలని హైకోర్టు బెంచ్ ఆదేశించింది. పారదర్శకత కోసం మత్తయ్య కేసు విచారణ వీడియో, ఆడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది. విచారణ సమయంలో అడ్వకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇతర సీనియర్ న్యాయవాదులు ఉండాలని న్యాయయమూర్తి ఆదేశించారు. మొత్తానికి తాజా పరిణామాలతో స్టీఫెన్సన్ కు గట్టి ఎదురుదెబ్బే తగిలినట్లుగా భావిస్తున్నారు.