Begin typing your search above and press return to search.

అది పరామర్శ కాదు.. ఫైనల్‌ టాక్స్‌

By:  Tupaki Desk   |   2 July 2015 5:23 AM GMT
అది పరామర్శ కాదు.. ఫైనల్‌ టాక్స్‌
X
నేతల మాటలు ఎంత అబద్ధాలో మరోసారి రుజువైంది. ఎంతో నమ్మకంగా చెప్పే వారి మాటలకు.. చేష్టలకు అస్సలు సంబంధం ఉండదన్నట్లుగా వారు వ్యవహస్తారన్న విషయం మరోసారి తేలింది. స్వల్ప అనారోగ్యంతో బాధ పడుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పరామర్శించేందుకు మాత్రమే తాను వచ్చానని చెప్పిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత డీఎస్‌ మాటల్లో అసలు విషయం తాజాగా నిరూపితమైంది.

తాను కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని తెలియజేస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి మూడు పేజీల లేఖ రాశారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీకి రెండుసార్లు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన డి. శ్రీనివాస్‌.

తాను పార్టీకి చేసిన సేవల్ని ప్రస్తావించిన డీఎస్‌.. తెలంగాణలో పార్టీకి జరిగిన నష్టానికి గల కారణాల్ని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన పోరాటాన్ని లేఖలో పేర్కొన్న డీఎస్‌ వైఖరి చూసినప్పుడు.. బుధవారం ముఖ్యమంత్రిని కలిసింది పరామర్శించటానికి కాదని తేలిపోతుంది. పార్టీలో చేరాలన్న అంశం మీడియాలో భారీగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. పార్టీ నుంచి ఎలా బయటకు రావాలి? అందుకు ఏం చేయాలన్న అంశాలపై ఫైనల్‌ టాక్స్‌ జరిపేందుకు.. తాను పార్టీ విడిచి.. టీఆర్‌ఎస్‌లో భాగస్వామ్యం కానున్నానన్న విషయాన్ని అనధికారికంగా అర్థమయ్యేలా చేయటం కోసమే కేసీఆర్‌ ఇంటికి వచ్చాన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.