Begin typing your search above and press return to search.

జ్యోతిలక్ష్మి ప్రతీకార 'మంత్ర'

By:  Tupaki Desk   |   3 July 2015 9:30 AM GMT
జ్యోతిలక్ష్మి ప్రతీకార మంత్ర
X
జ్యోతిలక్ష్మి అనే వేశ్యగా నటించింది అందాల చార్మి. అంతకంటే ముందే 'ప్రేమ ఒక మైకం'లోనూ వేశ్య పాత్రలో నటించి ఆకట్టుకుంది. అయతే వేశ్య పాత్రల్ని మించిన మరో క్యారెక్టర్‌ని కనిపెట్టడం ఎలా? దీనికి సొల్యూషన్‌ తెలుసుకుంది ఇప్పుడు. తనపై అఘాయిత్యం చేసిన మగపురుగులపై ప్రతీకారం తీర్చుకునే అతివ సరైన సొల్యూషన్‌. అతివ దెయ్యంగా మారి పగ తీర్చుకుంటే అదొక రకం రివెంజ్‌. లేదూ, దెయ్యంలా భయపెట్టే మామూలు మనిషే అయితే అదో కొత్త టెక్నిక్‌. ఈ రెండు టెక్నిక్‌లలో ఏదో ఒక టెక్నిక్‌తో భయపెట్టడానికి మన ముందుకు వస్తోంది ఛార్మి.

ఛార్మి నటించిన మంత్ర 2 త్వరలోనే రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో తనకి పూర్వ వైభవం తెచ్చి పెడుతుందని ఛార్మి ఆశిస్తోంది. సతీష్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. చక్కని హారర్‌ థ్రిల్లర్‌. పొసెస్సివ్‌ (రగిలిపోయే) గాళ్‌ క్యారెక్టర్‌ని అద్భుతంగా చూపిస్తున్నారు ఈ చిత్రంలో. మంత్ర చిత్రంతో తొలిసారి అవార్డ్‌ అందుకున్నా. మరోసారి ఆ స్థాయిలో ఎగ్జయిట్‌ చేసిన స్క్రిప్టు ఇదేనని చెప్పింది. ఈ చిత్రంలో చంపడం అనేది ఉత్కంఠ రేకెత్తిస్తుందని చెప్పింది. ఛార్మి కాన్ఫిడెన్స్‌ చూస్తుంటే ఈసారి కొట్టేట్టే కనిపిస్తోంది. ఫ్లాపుల బాట నుంచి సక్సెస్‌ వైపు వచ్చేట్టే ఉంది. ఆల్‌ ది బెస్ట్‌ ఛార్మి.