Begin typing your search above and press return to search.

చంద్రబాబూ.. ఇదేమి నిర్లక్ష్యం!?

By:  Tupaki Desk   |   4 July 2015 5:30 PM GMT
చంద్రబాబూ.. ఇదేమి నిర్లక్ష్యం!?
X
నవ్యాంధ్రప్రదేశ్‌లో కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేయడానికి ఉత్సాహం చూపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఉన్న యూనివర్సిటీలను దక్కించుకోవడంలో మాత్రం దారుణంగా విపలమవుతున్నారు. ఆయా యూనివర్సిటీల అధికారులు లేఖల మీద లేఖలు రాసినా పదో షెడ్యూల్లో ఉన్న వాటిలో భాగం పంచుకోవడానికి సిద్ధపడడం లేదు.

నవ్యాంధ్రలో ఈ ఏడాది ఐదు కొత్త యూనివర్సిటీలను ప్రారంభించనున్నారు.ఇంత వరకూ సంతోషమే. కానీ, నవ్యాంధ్రకు రావాల్సిన తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆయా యూనివర్సిటీల అధికారులు మీ వాటా మొత్తాన్ని చెల్లిస్తే ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహిస్తామని పదే పదే లేఖలు రాశారు. యూనివర్సిటీల ఆంధ్రప్రదేశ్‌ విభాగాలను ఏపీలో ఏర్పాటు చేయాలని సూచించారు. తెలుగు యూనివర్సిటీకి అయితే రాజమండిలో స్థలంతోపాటు భవనాలు ఉన్నాయి. ఓపెన్‌ యూనివర్సిటీని నాగార్జున వర్సిటీలో పెట్టాలని సూచించారు. కానీ, చంద్రబాబు వాటి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు.

దాంతో ఇప్పుడు ఆ రెండు యూనివర్సిటీల నుంచి ఏపీకి ఏమాత్రం సేవలు అందించేది లేదని తేల్చి చెప్పేశారు. ఆ రెండూ ఇప్పుడు కేవలం తెలంగాణకే పరిమితమయ్యాయి. వర్సిటీల వీసీలు లేఖలు రాసినప్పుడు పట్టించుకోకుండా.. పదో షెడ్యూల్లో బాగమైన ఆ సంస్థలు తెలంగాణ పరం అయిపోయిన తర్వాత గగ్గోలు పెడితే ఉపయోగం ఏముంటుంది?