Begin typing your search above and press return to search.

రకూల్‌, క్యాథరిన్‌ ఫిక్సయినట్టేనా??

By:  Tupaki Desk   |   1 July 2015 11:45 AM GMT
రకూల్‌, క్యాథరిన్‌ ఫిక్సయినట్టేనా??
X
బోయపాటి సినిమా అంటేనే రంగుల మయం. ఇద్దరు ముగ్గురు కథానాయికలు లేనిదే అతడి సినిమా ఉండదు. పెద్ద ఉమ్మడి ఫ్యామలీ అందులో అన్నలు, అక్కలు, చెల్లెళ్లు, తమ్ముళ్లు, వదినలు, మరదళ్లు .. ఇలా సందడి సందడిగా సినిమా సాగిపోతుంది. అతడు తెరకెక్కించిన ఏ సినిమా చూసినా ఇది కామన్‌ పాయింట్‌. ఇప్పుడు అవే కామన్‌ ఎలిమెంట్స్‌ బన్నీతో చిత్రంలోనూ ఉంటాయని తెలుస్తోంది. అంతేనా ఇప్పటికే బోయపాటి ఓ ఇద్దరు కథానాయికల్ని ఎంపిక చేసుకున్నాడు. రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ అధికారికంగా ఓకే అయ్యింది. అయితే రెండో నాయికగా క్యాథరిన్‌ని ఎంపిక చేశారని తెలుస్తోంది.

ఇటీవలే చెన్నయ్‌లో జరిగిన ఫిలింఫేర్‌ అవార్డుల వేడుకలో బోయపాటి సందడి చేశాడు. అక్కడికి విచ్చేసిన క్యాథరిన్‌ మైండ్‌ బ్లోవింగ్‌ లుక్‌తో అదరగొట్టేసింది. మద్రాస్‌ చిత్రంతో ఉత్తమ ఆరంగేట్ర నటిగా అవార్డ్‌ అందుకున్న ఈ భామ బోయపాటి మనసు దోచేసింది. దాంతో బన్ని సరసన రెండో నాయికగా ఎంపిక చేసుకున్నాడని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా పైసా, ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాల్లో క్యాథరిన్‌ నటనను ఎవరూ తప్పు పట్టలేరు. చక్కని ప్రతిభావని. కాబట్టి బోయపాటి ఆప్షన్‌ క్యాథరిన్‌కే అని అనుకోవచ్చు. అధికారికంగా వార్త వెలువడాల్సి ఉందింకా.