Begin typing your search above and press return to search.

31 కోసమే ఎదురుచూపులన్నీ

By:  Tupaki Desk   |   23 May 2015 11:30 AM GMT
31 కోసమే ఎదురుచూపులన్నీ
X
సినిమా కూడా పెళ్ళిలాంటిదే అంటారు. షూటింగ్ ని పెళ్ళిగా అనుకుంటే తర్వాత సారెలతో సాగనంపే కార్యక్రమమే సినిమా విడుదల. సారెల ముందు జరిగే తంతులానే సినిమా విడుదలలోనూ బోలెడన్ని కార్యక్రమాలుంటాయి. ఫస్ట్ లుక్, పాటలు దాని తర్వాత ట్రైలర్. ఇప్పటివరకూ బాహుబలి సినిమా ప్రధాన పాత్రధారుల పోస్టర్లను ఒక్కొక్కటిగా ఆవిష్కరించారు చిత్ర దర్శకుడు బాహుబలి. వీటికి విపరీతమైన స్పందన వేస్తోంది.

ఈ ప్రతిష్టాత్మక సినిమా విజువల్స్ పైనే ఇప్పుడు సినీ జనాల కళ్ళన్నీ. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విజువల్స్ చూసిన కరణ్ జోహార్ వంటి వారు ఈ సినిమా విజువల్స్ అత్యద్భుతం అని.. భారత చిత్ర సీమలో ఇటువంటివి చూసుండరని అంచనాలు పెంచేస్తున్నారు. దాదాపు మూడేళ్ళ పాటు తెరపైన కనపడని ప్రభాస్ ఈ సినిమాలో శివుడు, బాహుబలిగా ద్విపాత్రాభినయం చేశారు. ఆయన అభిమానులయితే ఈ చిత్రాలకు బదులుగా చిన్న టీజర్ విడుదల చేయొచ్చుగా అని రాజమౌళికి వినతినిచ్చారు. అంతగా ఎదురు చూస్తున్నారు వారి అభిమాన నటుడిని పరాక్రమ రూపంలో చూసేందుకు. అంతర్జాతీయ ప్రముఖులు ఈ సినిమాకి పనిచేయడం, ఈగ సినిమాతో సాంకేతికంగా రాజమౌళి ప్రతిభ దేశవ్యాప్తంగా తెలియడం, సుదీర్ఘమైన చిత్రీకరణ జరుపుకోవడం కలిసి ఈ సినిమా ఏ స్థాయిలో వుంటుందో అని అంతా కళ్ళు కాయలు కాచేలా 31వ తేదీకోసమే ఎదురుచూస్తున్నారు.